యాసంగిలో ఆరుతడి పంటలు వేసుకోవాలి
ABN , First Publish Date - 2021-12-10T04:45:15+05:30 IST
మండల రైతులు యాసంగిలో వరికి బదులు ఇతర పంటలను పండించి రాష్ట్రంలో ఆదర్శ ంగా నిలవాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు.

కలెక్టర్ జితేష్ వి.పాటిల్
దోమకొండ, డిసెంబరు 9: మండల రైతులు యాసంగిలో వరికి బదులు ఇతర పంటలను పండించి రాష్ట్రంలో ఆదర్శ ంగా నిలవాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. గురు వారం దోమకొండ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పా టు చేసిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. దోమకొం డ మండలం అన్ని విధాలుగా ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర, కేంద్ర బృందాలు పర్యటనలో భాగంగా జిల్లాలో దోమకొండనే ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. దోమకొండ మండ లానికి నేషనల్ హైవే దగ్గరలోనే ఉందని రైతులు కూరగాయ ల పంటలను సాగు చేసి హైదరాబాద్ తరలించేందుకు మం చి అవకాశం ఉందన్నారు. కూరగాయలు, వేరు శనగ, మిను ము, నువ్వులు, పెసర, శనగ, పొద్దు తిరుగుడు, ఆముదాం, కుసుమ, ఆవాల పంటలను సాగు చేసి అధిక దిగుబడులు పొందాలన్నారు. రైతులు వరి సాగు చేసి ఇబ్బందులు పడవ ద్దని సూచించారు. యాసంగిలో కొనుగోలు కేంద్రాలుండవని చెప్పారు. జనవరిలో ఒమైక్రాన్ వైరస్ పెరిగే అవకాశం ఉందని ప్రజలందరు జగ్రాత్తలు పాటించాలని సూచించారు. వ్యాక్సినేషన్ ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు. మండలంలో పుష్కలంగా వర్షపాతం నమోదైందని యాసంగిలో వరి సాగు కు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, ఇతర పంటలు సాగు చేస్తే కోతులు, అడవి పందుల బెడద ఉందని రైతులు వరి పంటనే సాగు చేసేలా చర్యలు తీసుకోవాలని జడ్పీటీసీ తీగల తిర్మల్‌గౌడ్, ఆర్‌ఎస్‌ఎస్ అధ్యక్షుడు రావులపల్లి నర్సారెడ్డి, విండో చైర్మన్ పన్యాల నాగరాజ్‌రెడ్డిలు కలెక్టర్ దృష్టికి తీసుకు వచ్చారు. స్పందించిన కలెక్టర్ అడవి పందుల బెడద ఉంటే వాటిని కాల్చడానికి జీవో వచ్చిందని, కోతుల నివారణకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక కమిటీ ఉందని త్వరలోనే కోతుల నివారణకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. అనంతరం జిల్లా వ్యవసాయాధికారిణి భాగ్యలక్ష్మీ మాట్లాడుతూ రైతులకు ఇతర పంటలపై ప్రతీ గ్రామంలో ఏఈవోలు అవగహన కల్పిస్తున్నారన్నారు. పామాయిల్ పంటలపై దృష్టి సారించి అధిక లాభాలు పొందాలని సూచించారు. రైతులకు సంబంధించి దోమకొండ క్లస్టర్ ఏఈవో క్రిష్ణారెడ్డి, అంబార్ పేట క్లస్టర్ శ్రీలతలు సలహాలు సూచనలు అందిస్తారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కోట సదానంద, ఏవో పవన్‌కుమార్, సర్పంచ్ నల్లపు అంజలి, వంగ లలిత, ఎంపీడో చిన్నారెడ్డి, గిర్దావర్ నరేందర్‌రెడ్డి, ఎంపీవో తిరుపతిరెడ్డి, రైతు సమన్వ య సమితి పట్టణ అధ్యక్షుడు కూర చంద్రం, పోగుల సాయి లు, సార్ల నర్సింలు, ఉప సర్పంచ్ గజవాడ శ్రీకాంత్, షమ్మీ, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, రైతులు పాల్గొన్నారు.
ప్రయాణికుల సమస్యలను పరిష్కరించాలి
మండల కేంద్రంలోని బస్డాండ్ ఆవరణలో సమస్యలను పరిష్కరించి ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా చూ డాలని బీజేపీ మండలాధ్యక్షుడు చింతల రాజేష్ గురువారం కలెక్టర్ జితేష్ వి. పాటిల్‌కు వినతిపత్రం అందజేశారు. బస్టా ండ్‌లో నీటి వసతి కల్పించాలన్నారు. విద్యార్థులకు సమ యానుకూలంగా బస్సు ట్రిప్పులను నడపాలని కోరారు. కార్య క్రమంలో ప్రధాన కార్యదర్శి పన్యాల రవీందర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు మాద్దూరి భూపాల్‌రెడి,్డ కాశిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
యాసంగిలో వరి కొనుగోలు ఉండదు
బీబీపేట: యాసంగిలో ఆరుతడి పంటలు వేసుకోవాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. గురువారం బీబీపేట మం డల కేంద్రంలోని రైతువేదికలో యాసంగి పంటలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వ ఆదేశాల మేరకు యాసంగిలో వరి కొనుగోలు కేంద్రాలు ఉండవని వరి వేసి రైతులు ఇబ్బ ందులు పడవద్దని తెలిపారు. ఒకవేళ వరి పంట వేస్తే రైతులు వారే మార్కెటింగ్ చేసుకోవాలని తెలిపారు. అనంతరం రైతులు మాట్లాడుతూ ప్రత్యామ్నాయ పంటలకు కోతులు, పందుల బెడద ఉందని, ప్రభుత్వం సబ్సిడీ ద్వారా సోలార్ జాలి వంటి పంట రక్షణ వస్తువులను అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి భాగ్యలక్ష్మీ, జడ్పీ వైస్‌చైర్మన్ ఇంద్రాసేనారెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ ప్రేమ్‌కుమార్, ఎంపీపీ బాలమణి, వైస్ ఎంపీపీ రవీందర్‌రెడ్డి, ఎంపీ డీవో నారాయణ, తహసీల్ధార్ శాంత, సర్పంచ్‌లు తేలు లక్ష్మీ, రాంరెడ్డి, వెంకట్‌రావు, ప్రసాద్, ఎంపీటీసీలు రవి, పల్లవి, నీరజ, మండల వ్యవసాయాధికారి పవన్, ఏఈవో సాగర్ తదితరులు పాల్గొన్నారు.