అనుమతులు లేని కల్లు దుకాణాల సీజ్
ABN , First Publish Date - 2021-05-22T04:30:40+05:30 IST
బాన్సువాడ డివిజన్ కేంద్రంలో ‘రెచ్చిపోతున్న కల్లు మాఫియా’ అనే కథనానికి ఎక్సైజ్ శాఖాధికారులు స్పందించారు.

బాన్సువాడ, మే 21 : బాన్సువాడ డివిజన్ కేంద్రంలో ‘రెచ్చిపోతున్న కల్లు మాఫియా’ అనే కథనానికి ఎక్సైజ్ శాఖాధికారులు స్పందించారు. శుక్రవారం బాన్సువాడ డివిజన్ కేంద్రంలో అనుమతులు లేని కల్లు దుకాణాలపై ఎక్సైజ్ సీఐ సంతోష్ రెడ్డి దాడులు చేపట్టి సీజ్ చేశారు. బాన్సువాడ పట్టణంలోని బీడీ కార్మికుల కాలనీకి వెళ్లే రహదారిలో ఉన్న దుకాణంతో పాటు తాడ్కోల్ రోడ్డులోని మహేశ్వరీ థియేటర్ పక్కన ఉన్న దుకాణం, బీడీ కార్మికుల కాలనీలోని బంగారు పోచమ్మ వద్ద ఉన్న కల్లు దుకాణం, అంగడి బజార్ వద్ద ఉన్న కల్లు దుకాణంతో పాటు అన్ని అనుమతి లేని కల్లు దుకాణాలను సీజ్ చేసినట్లు తెలిపారు. మరిన్ని అక్రమంగా కల్లు విక్రయించకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనుమతులు కల్లు దుకాణాలపై పూర్తి నిఘా పెట్టామని, త్వరలోనే సీజ్ చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.