పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు నేరం

ABN , First Publish Date - 2021-12-08T05:06:14+05:30 IST

పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు నేరమని ప్రిన్సిపాల్‌ డిస్ర్టిక్ట్‌ అండ్‌ సెషన్స్‌ జడ్జి, జిల్లా న్యాయసేవాధికారి సంస్థ చైర్‌పర్సన్‌ సునిత కుంచాల తెలిపారు.

పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు నేరం

నిజామాబాద్‌లీగల్‌, డిసెంబరు 7: పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు నేరమని ప్రిన్సిపాల్‌ డిస్ర్టిక్ట్‌ అండ్‌ సెషన్స్‌ జడ్జి, జిల్లా న్యాయసేవాధికారి సంస్థ చైర్‌పర్సన్‌ సునిత కుంచాల తెలిపారు. న్యాయసేవా సంస్థ ఆధ్వర్యంలో న్యాయసేవా సదన్‌లో నిర్వహించిన మహిళ సాధికారత సెమినార్‌లో ఆమె మాట్లాడుతూ పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపుల నిరోదకచట్టం 2013 మహిళా సాధికారత సాధనకు బలమైన పునాదులు నిర్మించిందని ఆర్థికస్వావలంబనకు అడుగులు వేయడానికి దారిచూపించిందని అన్నారు. లైగింక వేధింపుల నివారణకు విశాఖ మార్గదర్శకాలను భారతసుప్రీం కోర్టు జారీచేసిందని ఆమె గుర్తు చేశారు. స్త్రీల రక్షణ కోసం చట్టం అనే బలమైన సాధనం ఉందని, ఎంతటి బలవంతుడైన చట్టం ముందు దిగదుడుపేనన్నారు. అనంతరం ఫ్యామిలీకోర్టు షౌకత్‌ జహాన్‌ సిద్దిఖి మాట్లాడుతూ మహిళలకు చట్టపరిజ్ఞానం కల్పించడంకోసం న్యాయసేవా సంస్థ, న్యాయచైతన్యసదస్సులు నిర్వహిస్తుందని తెలిపారు. మహిళా సాధికారతకు వ్యక్తులు, వ్యవస్థలు సహకారం అవసరమన్నారు. కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జి గోవర్ధన్‌రెడ్డి, అదనపు జిల్లా జడ్జి పంచాక్షరి, సీనియర్‌ సివిల్‌ జడ్జి కిరణ్మయి, సంస్థ కార్యదర్శి సీనియర్‌ సివిల్‌ జడ్జి జే.విక్రమ్‌, జూనియర్‌ సివిల్‌ జడ్జిలు కళార్చన, అజయ్‌కుమార్‌ జాదవ్‌, భవ్య, గిరిజ, సౌందర్య, సంస్థ సభ్యులు రాజ్‌కుమార్‌ సుబేదార్‌, అంకిత, మాణిక్‌రాజు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-08T05:06:14+05:30 IST