రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు
ABN , First Publish Date - 2021-01-13T04:47:33+05:30 IST
రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాల య్యాయి.

ఇందల్వాయి, జనవరి 12: రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాల య్యాయి. ఈ ఘటన ఇందల్వాయి పోలీసుస్టేషన్ పరిధిలోని గన్నారం సమీపంలో 44వ నెంబర్ జాతీయ రహదారిపై మంగళవారం చోటు చేసు కుంది. భీమ్‌సింగ్ ద్విచక్రవాహనం పై నుంచి అదుపు తప్పి రోడ్డుపై పడి పోయాడు. దీంతో టోల్‌ఫ్లాజా అంబులెన్స్‌లో నిజామాబాద్ ప్రభుత్వ ఆసు పత్రికి తరలించినట్లు పీఆర్‌వో వెంకటేశ్వర్లు తెలిపారు. భీమ్‌సింగ్ స్వగ్రామం మాక్లూర్ కాగా పని నిమిత్తం కామారెడ్డి వెళ్లి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు.