ఇసుక లారీల పట్టివేత

ABN , First Publish Date - 2021-10-22T03:56:19+05:30 IST

బీర్కూర్‌ సమీపంలోని మంజీరా పరివాహక ప్రాంతంలో ప్రభుత్వం గత కొన్ని రోజుల క్రితం టీఎస్‌ఎండీసీ ఆధ్వర్యంలో ఇసుక క్వారీలకు అనుమతిచ్చింది.

ఇసుక లారీల పట్టివేత

బీర్కూర్‌, అక్టోబరు 21: బీర్కూర్‌ సమీపంలోని మంజీరా పరివాహక ప్రాంతంలో ప్రభుత్వం గత కొన్ని రోజుల క్రితం టీఎస్‌ఎండీసీ ఆధ్వర్యంలో ఇసుక క్వారీలకు అనుమతిచ్చింది. అయితే క్వారీ నిర్వాహకులు ఇసుకను లారీల్లో పరిమితికి మించి లోడ్‌ చేస్తూ తరలిస్తున్నారు. గురువారం ఓవర్‌ లోడ్‌తో వెళుతున్న లారీలను జిల్లా గనుల భూగర్భ శాఖాధికారి నర్సిరెడ్డి పట్టుకున్నారు. ఆరు లారీలకు రూ.92వేల జరిమానా విధించినట్లు ఆయన తెలిపారు. ఇసుక క్వారీల నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనల మేరకు లారీల్లో ఇసుక నింపాల్సి ఉండగా, రూ.2వేలను అదనంగా ఒక్కొక్క బకీట్‌ రూ.2వేలు వసూలు చేస్తూ ఓవర్‌ లోడ్‌ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Updated Date - 2021-10-22T03:56:19+05:30 IST