విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలి

ABN , First Publish Date - 2021-05-30T05:51:17+05:30 IST

జూన్‌ మొదటి వారంలో వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉ న్నందున రైతులు వానాకాలం పంటల సాగుకు ఏర్పాట్లు చేసుకుంటారని, అందుకు అనుగుణం గా విత్తనాలు, ఎరువులు పూర్తిస్థాయిలో అందు బాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి వ్యవసాయశాఖ అధికారు లను ఆదేశించారు.

విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ నారాయణరెడ్డి

అధికారులకు కలెక్టర్‌ ఆదేశం

నిజామాబాద్‌అర్బన్‌, మే 29: జూన్‌ మొదటి వారంలో వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉ న్నందున రైతులు వానాకాలం పంటల సాగుకు ఏర్పాట్లు చేసుకుంటారని, అందుకు అనుగుణం గా విత్తనాలు, ఎరువులు పూర్తిస్థాయిలో అందు బాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి వ్యవసాయశాఖ అధికారు లను ఆదేశించారు. శనివారం వ్యవసాయ, మా ర్కెఫెడ్‌, సహకార, ఇతర అధికారులతో వానాకా లం సాగుపై సెల్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంచనాలు, లక్ష్యాలకు అనుగుణంగా జిల్లాలో ఎంత విస్తీర్ణం లో ఏ పంటలు సాగు చేస్తున్నారో ఇప్పటికే అధి కారులు ఒక అవగాహనకు వచ్చినందున అందు కు అనుగుణంగా సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులను సి ద్ధం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. అదేవిధ ంగా రైతుల అవసరాలను బలహీనంగా భావిం చే కొందరు వ్యాపారులు అక్రమాలకు పాల్పడి న కిలీ విత్తనాలు విక్రయించకుండా గట్టి చర్యలు తీసుకోవడంతో పాటు తనిఖీలు నిర్వహించాలన్నా రు. అధిక ధరలకు ఎరువులు, విత్తనాలు విక్రయి ంచకుండా, బ్లాక్‌ మార్కెటింగ్‌ చేయకుండా ఆక స్మిక తనిఖీలు చేయాలని, డీలర్ల వద్ద స్టాక్‌ చెక్‌ చేయాలని ఆదేశించారు. ఎరువులతో వచ్చే ర్యాక్‌ లను వెంటనే అన్‌లోడ్‌ చేయించాలని, తద్వారా అవసరానికి అనుగుణంగా ఎరువులను సరఫరా చేయవచ్చన్నారు. ఎరువులు, విత్తనాలు సరఫరా విషయంలో వ్యవసాయ, పోలీసు, రెవెన్యూ అధి కారులతో డివిజన్‌స్థాయి టాస్క్‌ఫోర్స్‌ టీంలు ఏ ర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో 7 లక్షలకు పైగా ఎకరాలలో పంటల సాగుకు అవకా శం ఉన్నందున అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. రైతుబంధు పథకంలో డబ్బులకు సంబంధించి రైతులు వారి బ్యాంక్‌ ఖాతా, బ్యాంక్‌పేరు మారి ఉంటే వివరాలను వ్యవసా య శాఖ అధికారులకు అందించి మార్పులు చే సుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్‌ కోరారు. ఈ సెల్‌ కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, డీసీవో సింహాచలం, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్‌ తదితరులు పాల్గొన్నారు. 

వ్యాక్సినేషన్‌ కేంద్రం పరిశీలన 

నగరంలోని గిరిరాజ్‌  ప్రభుత్వ కళాశాలలో కొ నసాగుతున్న సూపర్‌ స్ర్పైడర్‌ల వ్యాక్సినేషన్‌ కేం ద్రాన్ని కలెక్టర్‌ నారాయణరెడ్డి శనివారం పరిశీలి ంచారు. చంద్రశేఖర్‌ కాలనీ, దుబ్బ పరిధిలో వారి కోసం గిరిరాజ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈ కే ంద్రంలో వ్యాక్సినేషన్‌ ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చూడాలని, ప్రణాళిక ప్రకారం నిర్వహించాలని డాక్టర్‌లను ఆదేశించారు. నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌ సైతం గిరిరాజ్‌ కళాశాలలో నిర్వహిసున్న వ్యాక్సినేషన్‌ను పరిశీలించి వివరాలను అ డిగి తెలుసుకున్నారు. 

సోమవారం నుంచి కూలీలు పెరగాలి

ఉపాధి హామీ పథకంలో కూలీల సంఖ్యను సోమవారం నుంచి పెంచాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం క లెక్టర్‌ సంబంధిత అధికారులతో నర్సరీలు, హరితహారం, ఉపాధిహామీ కూలీల పెంపు తదితర అంశాలను అధికారులతో వీడియోకాన్ఫరెన్స్‌ ద్వా రా సమీక్షించారు. ఉపాధిహామీ కూలీల సంఖ్య పెంచాలని గతంలో ఆదేశించినా ఆశించిన స్థా యిలో పెరగలేదని, ఏపీవోలు బాధ్యతతో పనిచేయాలన్నారు. కొన్ని మండలాల్లో పెరిగినప్పటికీ మిగిలిన మండలాల్లో పెరగకపోవడంతో అసం తృప్తి వ్యక్తం చేశారు. ఉపాధి కూలీల సంఖ్య పెం పుపైనే జిల్లా అభివృద్ధి ఆధారపడి ఉందని, కావు న ప్రతీ మండలంలో సోమవారం 200లకు, గు రువారం వరకు 250 వరకు వెళ్లాలన్నారు. జిల్లా లో ప్రస్తుతం కరోనా తగ్గిందని, ఉపాధిహామీ ప నులను పెంచాలన్నారు. హరితహారం మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉండాలని, ప్రతీ గ్రామంలో ప్రతీ ఇంటికి ఆరు మొక్కలు ఇవ్వాలని, అవి కూ డా నచ్చినవి ఇవ్వాలన్నారు. హరితహారం విషయంలో ప్రభుత్వం సీరియస్‌గా ఉందని, పెట్టిన ప్రతీ మొక్క బతకాలని, ఏ ఒక్క మొక్క చనిపోవద్దని అన్నారు. మొక్కలు తగలపెడితే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ గ్రామంలో కొవి డ్‌ లక్షణాలు ఉన్నవారిని మెడికల్‌ కిట్స్‌ ఇవ్వాలని ఇది నిరంతరం జరగాలన్నారు. ఈ సమావేశం లో అదనపు కలెక్టర్‌ లత, జడ్పీ సీఈవో గోవింద్‌, తదితరులు పాల్గొన్నారు. 

నేడు ఆర్టీసీ ఉద్యోగులకు వ్యాక్సిన్‌

జిల్లాలోని ఆర్టీసీ ఉద్యోగులకు ఆదివారం కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయనున్నట్టు కలెక్టర్‌ నారాయణరెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం ఆర్టీసీ, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, ఆర్డీవోలతో సెల్‌కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ మాట్లాడారు. జిల్లాలోని 537 మం ది ఆర్టీసీ ఉద్యోగులకు ఉదయం 8గంటల నుంచి 12 గంటల మధ్య వ్యాక్సిన్‌ చేసేందుకు అధికారు లు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. నిజామాబాద్‌, బోధన్‌, ఆర్మూర్‌లలో వ్యాక్సినేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేసి.. ఏ ఒక్క ఉద్యోగి కూడా మిస్‌ కాకుండా చూసుకోవాలని ఆయన తెలిపా రు. ఈ కాన్ఫరెన్స్‌లో ఆర్టీసీ ఆర్‌ఎం సుధా పరిమి ల, ఆర్డీవోలు రవి, శ్రీనివాస్‌, రాజేశ్వర్‌, వైద్య ఆరో గ్యశాఖ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-30T05:51:17+05:30 IST