రెండో రోజు పల్స్‌ పోలియో 7.33 శాతం

ABN , First Publish Date - 2021-02-02T05:15:09+05:30 IST

జిల్లాలో పల్స్‌పోలియో విజయవంతమైందని డీఎంహెచ్‌వో డాక్టర్‌ సుదర్శనం తెలిపారు.

రెండో రోజు పల్స్‌ పోలియో 7.33 శాతం

పెద్దబజార్‌, ఫిబ్రవరి 1: జిల్లాలో పల్స్‌పోలియో విజయవంతమైందని డీఎంహెచ్‌వో డాక్టర్‌ సుదర్శనం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1,83,220 పిల్ల లకుగాను మొదటి రోజు 1,70,013 (92.79 శాతం), రెండో రోజు 13,429 చిన్నారులకు (7.33 శాతం) మందికి పల్స్‌పోలియో చుక్కలు వేసినట్లు తెలిపారు. ఎ వరైనా పిల్లలు అందుబాటులో లేనివారు మంగళవారం ఏఎన్‌ఎంలు, అంగన్‌ వాడీలు, ఆశావర్కర్లు ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేయనున్నట్లు తె లిపారు. జిల్లా వ్యాప్తంగా 1700 కేంద్రాల్లో పల్స్‌పోలియో చుక్కలను వేసినట్లు తెలిపారు. ఇందులో 4277మంది సిబ్బంది పాల్గొన్నట్లు ఆయన తెలిపారు.

Updated Date - 2021-02-02T05:15:09+05:30 IST