ఎస్సీ కార్పొరేషన్‌ రుణాల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలి

ABN , First Publish Date - 2021-02-26T04:42:52+05:30 IST

ఎస్సీ కార్పొరేషన్‌ రుణాల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని జడ్పీ చైర్‌పర్సన్‌ దఫేదార్‌ శోభ అన్నారు.

ఎస్సీ కార్పొరేషన్‌ రుణాల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలి
జడ్పీస్థాయీ సంఘ సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీ చైర్‌పర్సన్‌

కామారెడ్డి, ఫిబ్రవరి 25: ఎస్సీ కార్పొరేషన్‌ రుణాల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని జడ్పీ చైర్‌పర్సన్‌ దఫేదార్‌ శోభ అన్నారు. గురువా రం జడ్పీస్థాయి సాంఘిక సంక్షేమం సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 80శాతం ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా సబ్సిడీ ఇవ్వడం జరుగుతుం దని కేవలం 20శాతం మాత్రమే బ్యాంకు లోన్‌ మంజూరు చేయడంలో జాప్య ం జరుగుతుందన్నారు. దీంతో లబ్ధిదారులు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేసి మంజూరైన యూనిట్లను వెంటనే గ్రౌండింగ్‌ చేయాలని అధికారులకు సూచించారు. ఎల్‌పీఎస్‌ పథకం కింద భూమి కొనుగోలు టార్గెట్‌ను పూర్తిచేయాలని ఈ పథకంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వసతి గృహాల అధికారులకు తప్పకుండా కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ విద్యార్థు లకు ఎటువంటి ఇబ్బందులు కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం 6,7,8 తరగతులు కూడా ప్రారంభమయ్యాయని ఇట్టి విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని ఎప్పటికప్పుడు వసతి గృహాలను తనిఖీ చేయాలని సూచించారు. ప్రస్తుతం మహారాష్ట్రలో కేసులు పెరుగుతు న్నందున కామారెడ్డి సరిహద్దు మండలాల్లో ఉన్న వసతి గృహాల యందు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మహా త్మ జ్యోతి బాపులే వెనుకబడిన తరగతుల రెసిడెన్షియల్‌ పాఠశాలలు ఏడు మండలాల్లో నడుస్తున్నాయని కానీ అన్నిచోట్ల ప్రైవేట్‌ బిల్డింగ్‌లలో కొనసా గుతున్నాయని, ప్రస్తుతం కొవిడ్‌ దృష్ట్యా అన్ని తరగతులు ప్రారంభమైనచో వసతి కల్పించడం ఇబ్బందికరంగా ఉంటుందని దీనిపై చర్యలు తీసుకునే విధంగా చూడాలని సంబంధిత అధికారి సభ్యుల దృష్టికి తేగా చైర్‌పర్సన్‌ స్పందిస్తూ తక్షణమే జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లవలసిందిగా సూచించారు. సాయంత్రం జరిగిన వ్యవసాయ స్థాయీ సమావేశానికి జడ్పీ వైస్‌ చైర్మన్‌ ప్రేమ్‌కుమార్‌ అధ్యక్షతన నిర్వహించారు. పీపీఆర్‌ వ్యాధి నివారణ మందులు గొర్రెలు, మేకలకు జిల్లా యందు 80శాతం వరకు పూర్తి అయిందని తెలియజే శారు. గ్రామీణ ప్రాంతం గృహిణులకు ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు పెరిటి కోళ్ల పెంపకం కింద జిల్లాకు 315 యూనిట్లు లక్ష్యం కాగా ఇప్పటి వరకు 111 యూనిట్లు సరఫరా చేయడం జరిగిందని తెలిపారు. యూనిట్‌ విలువ 1,575 కాగా సబ్సిడీ 1,250 లబ్ధిదారుల వాటా 325 యూనిట్‌ యొక్క పరిమాణం 25 కోడి పిల్లలుగా సభ్యులకు తెలియజేశారు. మత్స్యశాఖ అధికారి మాట్లాడు తూ 2020-21 సంవత్సరానికి గాను మత్స్యశాఖ ద్వారా 592 నీటి వనరులలో 3.29 లక్షల చేప పిల్లలను విడుదల చేసినట్లు తెలిపారు. నీటి వనరుల్లో రొయ్యల పెంపకం జరగాలని సభ్యులు సూచించారు. అటవీశాఖ అధికారి వసంత మాట్లాడు తూ ఆగ్రో ఫారెస్ట్రి పథకం ద్వారా అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌, పశు సంవర్థకశాఖ ఆధ్వర్యంలో శ్రీగంధం మొక్కలను 52 ప్రాంతాల్లో నాటామన్నారు. హరితహా రంలో భాగంగా అటవీశాఖకు నిర్ధేశించిన లక్ష్యం కంటే 104శాతం పూర్తి చేసినట్లు తెలిపారు. వైస్‌ చైర్మన్‌ మాట్లాడుతూ జిల్లాలోని మూడు డివిజన్లలో శ్రీగంధం మొక్కలు నాటుటకు అధికారులకు సూచిం చారు. పంచాయతీరాజ్‌ రోడ్లకు ఇరువైపుల చింత, వేప, మామిడి మొక్కలను నాటాలని సూచించారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో చందర్‌నాయక్‌, సాంఘిక సంక్షేమ స్థాయీ చైర్మన్‌ రమాదేవి, సభ్యులు జన్నుబాయి, తిర్మల్‌ గౌడ్‌, హన్మండ్లు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-26T04:42:52+05:30 IST