చికిత్స పొందుతూ పారిశుధ్య కార్మికుడి మృతి

ABN , First Publish Date - 2021-11-29T05:02:33+05:30 IST

మండంలంలోని తిప్పాపూర్‌ గ్రామానికి చెందిన పారిశుధ్య కార్మికుడు బాలయ్య (43) ఆదివారం చికిత్స పొందుతూ మృతిచెందాడు.

చికిత్స పొందుతూ పారిశుధ్య కార్మికుడి మృతి

భిక్కనూర్‌, నవంబరు 28: మండంలంలోని తిప్పాపూర్‌ గ్రామానికి చెందిన పారిశుధ్య కార్మికుడు బాలయ్య (43) ఆదివారం చికిత్స పొందుతూ మృతిచెందాడు. కు టుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తిప్పాపూర్‌ గ్రామ పంచాయతీలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తు న్న బాలయ్య శనివారం రాత్రి గ్రామపంచాయతీకి సంబంధించిన ఊర్లలోని మోటార్లు బందు చేసి వస్తానని ఇంట్లో చెప్పి ద్విచక్ర వాహనంపై బయలుదేరి వెళ్లాడు. రాత్రైనా ఇంటికి రాకపోవడంతో ఎప్పటిలాగా గ్రామసంచాయక భవనంలో పడుకొని ఉంటాడని కుటుంబసభ్యులు భావించారు. ఆదివారం ఉదయం బాలయ్య భార్య భూలక్ష్మీకి స్థానికులు బాలయ్య లక్ష్మీదేవున్‌పల్లి వెళ్లె రోడ్డు పక్కన పోలంలో పడి ఉన్నాడని, ముఖానికి, తలకు తీవ్ర గాయాలయ్యాయని సమాచారం ఇచ్చారు. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి అతనిని తరలించినట్లు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించాలని సూచించడంతో తీసుకువెళ్తుండగా మార్గమాధ్యలో మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-11-29T05:02:33+05:30 IST