రహదారులకు మహర్దశ

ABN , First Publish Date - 2021-05-31T05:20:12+05:30 IST

జిల్లాలోని బోధన్‌ నియోజకవర్గంలో రహదారులకు మహర్దశ వచ్చింది. ఎన్నోయేళ్లుగా ఎదురు చూస్తున్న రోడ్లు విస్తరణకు నోచుకోనున్నాయి. రోడ్ల విస్తరణ తో రహదారులు అద్దంలా మారనున్నాయి.

రహదారులకు మహర్దశ
బోధన్‌ - సుంకిని రోడ్డు ఇదే..

బోధన్‌ నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణానికి రూ.14కోట్ల నిధులు మంజూరు

మూడు రహదారుల విస్తరణ

బోధన్‌ మీదుగా రెండు జాతీయ రహదారులు

ఈప్రాంత ప్రజల ఎన్నోయేళ్ల కలకు మోక్షం

బోధన్‌, మే 30: జిల్లాలోని బోధన్‌ నియోజకవర్గంలో రహదారులకు మహర్దశ వచ్చింది. ఎన్నోయేళ్లుగా ఎదురు చూస్తున్న రోడ్లు విస్తరణకు నోచుకోనున్నాయి. రోడ్ల విస్తరణ తో రహదారులు అద్దంలా మారనున్నాయి. ఎన్నోయేళ్లుగా రోడ్ల విస్తరణకు, రోడ్ల నిర్మాణానికి ఎదురు చూస్తున్న ప్రజ లకు ఎట్టకేలకు తీపి కబురు అందింది. బోధన్‌ నియోజకవ ర్గంలో మూడు ప్రధాన రహదారుల విస్తరణకు ప్రభుత్వం రూ.14కోట్ల నిధులు మంజూరు చేసింది. రోడ్ల విస్తరణకు నిధులు మంజూరు కావడంతో త్వరలోనే రోడ్ల ని ర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఏ కకాలంలో బోధన్‌ నియోజక వర్గ ంలోని మూడు ప్రధా న రహ దారుల విస్తరణకు నిధు లు మంజూరు కావడం ప్రజలకు సంతోషాన్ని క లిగిస్తోంది. మరోవైపు బో ధన్‌ నియోజకవర్గం మీ దుగా రెండు జాతీయ ర హదారులు మంజూరు కావడంతో నియోజకవర్గ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తు న్నారు. ఇటు గ్రామీణ ప్రాంతాల రోడ్లు, అటు జాతీయ రహ దారుల నిర్మాణాలకుప్రుత్వం నుంచి పద్ద ఎత్తున నిధులు మంజూరు కావడంతో భవిష్యత్తులో బోధన్‌ నియోజకవర్గం రూపు రేఖలు మారిపోయేలా చేయనుంది. అంతేకాకుండా వ్యాపార వాణిజ్య రంగాలలో సైతం అభివృద్ధి చెందే అవకాశం ఎంతైనా ఉంది.

మూడు రహదారులకు రూ.14కోట్ల నిధులు

బోధన్‌ నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల రహదా రుల నిర్మాణం కోసం ఎమ్మెల్యే షకీల్‌ ప్రత్యేక చొరవ చూపా రు. జిల్లా మంత్రి ప్రశాంత్‌రెడ్డి చొరవతో ప్రభుత్వం ద్వారా రహదారుల నిర్మాణానికి నిధులను మంజూరు చేయించు కున్నారు. బోధన్‌ నియోజకవర్గంలోని బోధన్‌ మండలం పె గడాపల్లి నుంచి హంగర్గ వరకు, బోధన్‌ నుంచి కోటగిరి మ ండలం సుంకిని వరకు, బోధన్‌ అంబేద్కర్‌ చౌరస్తా నుం చి పట్టణ శివారులోని బాబా గార్డెన్‌ వరకు రెండు వరుసల రహదారుల నిర్మాణానికి రూ.14కోట్ల నిధులు మం జూరయ్యాయి. మూడు రహదారుల నిర్మాణాని కి పెద్ద ఎత్తున నిధులు మంజూరు కావడం నియోజకవర్గ ప్రజలను సంతోషానికి గురి చేసింది. గత ఎన్నోయేళ్లుగా ఈ రోడ్ల ని ర్మాణానికి ప్రజలు ఎదురు చూస్తున్నా రు. బోధన్‌ మండలంలోని పె గడాప ల్లి నుంచి హంగర్గ వరకు రహదారి అధ్వానంగా మా రి బోధన్‌, రెంజల్‌ మండల ప్రజలు తీవ్ర అవస్థలు ఎ దుర్కొంటున్నారు. రహదారి నిర్మాణ ం అస్తవ్యస్తంగా ఉండడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పె గడాపల్లి నుంచి హంగర్గ వర కు రోడ్డును రెండు వరుసల రహదారులుగా మార్చేందుకు ఎమ్మెల్యే షకీల్‌ ప్రతిపాదనలు సిద్ధంచేసి నిధులు మంజూరు చేయించడం లో ప్రత్యేక చొరవ చూపారు. బోధన్‌ నుంచి సుంకిని వరకు రోడ్డు నిర్మాణం అస్తవ్యస్తంగా మారి ప్రజల రాకపోకలకు తీ వ్ర ఇబ్బంది కరంగా మారింది. ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగించడమే ఈ రహదారి పై గగనంగా మారింది. బోధన్‌, కోటగిరి మండలాలను కలిపే ఈ రహదారి నిర్మాణం ఎన్నో యేళ్ల కలగా ఉంది. సుమారు పది గ్రామాలపైనే ప్రజలు ఈ రహదారిపై నిత్యం రాకపోక లు కొనసాగిస్తుంటారు. ఈ రోడ్డునిర్మాణానికి నిధులు మంజూరు కావడంతో రెండు మ ండలాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బోధన్‌ అం బేద్కర్‌ చౌరస్తా నుంచి పట్టణ శివారులోని బాబాగార్డెన్‌ వ రకు రెండు వరుసల రహదారి నిర్మాణానికి నిధులు మం జూరు కావడంతో ట్రాఫిక్‌ సమస్య తీరనుంది. మూడు రహ దారుల నిర్మాణానికి  నిధులు మంజూరు కావడం త్వరలోనే పనులు ప్రారంభమయ్యే పరిస్థితులు ఉండడంతో బోధన్‌ ని యోజకవర్గం ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

బోధన్‌ మీదుగా రెండు జాతీయ రహదారులు

గ్రామీణ ప్రాంతాల రోడ్ల నిర్మాణానికి రూ.14కోట్ల నిధులు మంజూరు కావడం ఓ వైపు గ్రామీణ ప్రాంతాల రోడ్లకు మహర్దశ సంకేతాలు చూపుతుండగా బోధన్‌ మీదుగా రెండు జాతీయ రహదారులు మంజూరు కావడం రోడ్లు మరిం త మెరుగుపడేలా చేయనుంది. మద్నూర్‌ నుంచి బాసర వరకు జాతీయ రహదారి నిర్మాణానికి ఇప్పటికే నిధులు మం జూరై సర్వే పనులు పూర్తికాగా.. పోతంగల్‌, కోటగిరి, రుద్రూరు మీదుగా బోధన్‌ నుంచి బాసర వరకు జాతీయ ర హదారి నిర్మాణం కొనసాగనుంది. మరోవైపు సంగారెడ్డి నుంచి బాసర వరకు మరో జాతీయ రహదారి నిర్మాణానికి ని ధులు మంజూరు కావడంతో రెండు జాతీయ రహదారులు బోధన్‌ మీదుగానే ముందుకుసాగే పరిస్థితులుండడంతో బోధన్‌లో రహదారులకు సైతం మోక్షం కలిగి రోడ్ల రూపురేఖలు మారనున్నాయి.

Updated Date - 2021-05-31T05:20:12+05:30 IST