రాళ్లవాన

ABN , First Publish Date - 2021-12-30T05:33:52+05:30 IST

జిల్లాలోని ప లు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం ఒక్కసారిగా ఉరు ములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. నగరంతో పాటు డిచ్‌పల్లి, జక్రాన్‌పల్లి, ఆర్మూర్‌ ప్రాంతాల్లో మోస్తరు వాన పడింది.

రాళ్లవాన

కోటగిరి, రుద్రూరు మండలాల్లో  కురిసిన వర్షం

కోటగిరి/రుద్రూరు, డిసెంబరు 23: జిల్లాలోని ప లు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం ఒక్కసారిగా ఉరు ములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. నగరంతో పాటు డిచ్‌పల్లి, జక్రాన్‌పల్లి, ఆర్మూర్‌ ప్రాంతాల్లో మోస్తరు వాన పడింది. రుద్రూరు, కోటగిరి మండల కేంద్రాలతో పాటు సులేమాన్‌ఫారం, రా ణంపల్లి, చిక్కడ్‌పల్లి, రాయ్‌ కూర్‌, రాయ్‌కూర్‌ క్యాంపు, ఎత్తొండ, యాద్గార్‌పూర్‌, హె గ్డోలి తదితర గ్రామాల్లో సాయంత్రం 7 గంటలకు ఒక్క సారిగా రాళ్ల వర్షం పడింది. ఎత్తొండలో ఒక్కో రాయి సుమారు వంద గ్రాముల వరకు ఉన్నట్లు గ్రామ మాజీ సర్పంచ్‌ ఆనంద్‌ తెలిపారు. కాగా.. అకస్మాతుగా రాళ్ల వాన పడడంతో.. ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

Updated Date - 2021-12-30T05:33:52+05:30 IST