తరుగు పేరిట దోచుకుంటున్నారు!

ABN , First Publish Date - 2021-11-09T05:57:16+05:30 IST

కొనుగోలు కేంద్రంలో ధాన్యం తరుగు పేరిట తమను సిబ్బంది, రైస్‌ మిల్లర్లు నిలువునా దోచుకుంటున్నారని బీర్కూర్‌ గ్రామ రైతులు మండిపడ్డారు. సోమవారం బీర్కూర్‌ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం వద్ద వారు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా విండో చైర్మన్‌ కొల్లి గాంధీని పలు సమస్యలపై నిలదీశారు. అనంతరం పలువురు రైతులు మాట్లాడుతూ.. తాము నిబంధనల ప్రకారం ధాన్యాన్ని తీసుకొస్తున్నా సిబ్బంది మాత్రం ఇష్టానుసారంగా తరుగు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రంలో కాంటా చేసేటప్పుడు సిబ్బంది క్వింటాకు 4 కిలోల తరుగు తీస్తుండగా.. రైస్‌మిల్లర్లు సైతం అదనంగా తరుగు తీస్తున్నారన్నారు. వెంటనే తరుగు పేరిట చేస్తున్న దోపిడీని ఆపాలని రైతులు డిమాండ్‌ చేశారు.

తరుగు పేరిట దోచుకుంటున్నారు!

బీర్కూర్‌, నవంబరు 8: కొనుగోలు కేంద్రంలో ధాన్యం తరుగు పేరిట తమను సిబ్బంది, రైస్‌ మిల్లర్లు నిలువునా దోచుకుంటున్నారని బీర్కూర్‌ గ్రామ రైతులు మండిపడ్డారు. సోమవారం బీర్కూర్‌ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం వద్ద వారు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా విండో చైర్మన్‌ కొల్లి గాంధీని పలు సమస్యలపై నిలదీశారు. అనంతరం పలువురు రైతులు మాట్లాడుతూ.. తాము నిబంధనల ప్రకారం ధాన్యాన్ని తీసుకొస్తున్నా సిబ్బంది మాత్రం ఇష్టానుసారంగా తరుగు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రంలో కాంటా చేసేటప్పుడు సిబ్బంది క్వింటాకు 4 కిలోల తరుగు తీస్తుండగా.. రైస్‌మిల్లర్లు సైతం అదనంగా తరుగు తీస్తున్నారన్నారు. వెంటనే తరుగు పేరిట చేస్తున్న దోపిడీని ఆపాలని రైతులు డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2021-11-09T05:57:16+05:30 IST