వరి సాగా..? ఆరుతడి పంటలా!?

ABN , First Publish Date - 2021-12-30T05:30:00+05:30 IST

ఉభయ జిల్లాల వరప్రధాత నిజాంసాగర్‌ ప్రాజెక్టులో ఈ యేడాది యాసంగిలో పుష్కలంగా నీటి నిల్వలున్నాయి. ఇప్పటికే ఉభయ జిల్లాల అధికార యంత్రాంగం యాసంగి ప్రణాళికను ఖరారు చేసింది. నిజాం సాగర్‌ ఆయకట్టు కింద లక్షా 15వేల ఎకరాలకే సాగునీటిని అందించేలా కార్యచరణ రూపొందిం చారు. నిజాంసాగర్‌ ప్రధాన కాల్వ వెంట ఉన్న డిస్ర్టిబ్యూటరీ 0 నుంచి 49 వరకు నిజాంసాగర్‌ నుంచి నీటిని విడుదల చేయనున్నారు.

వరి సాగా..? ఆరుతడి పంటలా!?

నిజాంసాగర్‌ ప్రాజెక్టులో పుష్కలంగా నీరు 

పది రోజులుగా ఒక టీఎంసీ నీటి విడుదల 

ఏటూ తేల్చుకోలేకపోతున్న రైతులు

నిజాంసాగర్‌, డిసెంబరు 30: ఉభయ జిల్లాల వరప్రధాత నిజాంసాగర్‌ ప్రాజెక్టులో ఈ యేడాది యాసంగిలో పుష్కలంగా నీటి నిల్వలున్నాయి. ఇప్పటికే ఉభయ జిల్లాల అధికార యంత్రాంగం యాసంగి ప్రణాళికను ఖరారు చేసింది. నిజాం సాగర్‌ ఆయకట్టు కింద లక్షా 15వేల ఎకరాలకే సాగునీటిని అందించేలా కార్యచరణ రూపొందిం చారు. నిజాంసాగర్‌ ప్రధాన కాల్వ వెంట ఉన్న డిస్ర్టిబ్యూటరీ 0 నుంచి 49 వరకు నిజాంసాగర్‌ నుంచి నీటిని విడుదల చేయనున్నారు. నిజాం సాగర్‌ ప్రాజెక్టుకు ఉన్న సీడీ 1, సీడీ2 డిస్ర్టిబ్యూట రీల కింద ఏ పంటలు వేయాలని రైతులు అయో మయంలో పడుతున్నారు. ఇప్పటికి సీడీ 1, సీడీ 2 డిస్ర్టిబ్యూటరీల కింద దాదాపు 600 ఎకరాలు బీడు భూములు గానే దర్శనమిస్తున్నాయి. అధికా ర యంత్రాంగం పుష్కలంగా నీరున్న చోట వరి పైరు వేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కానీ, వేసిన వరి పైరును ఎవరు కొంటారనే ఉద్ధేశంతో రైతులు వరి పైరు పైన మక్కువ చూపడం లేదు. నిజాంసాగర్‌ ప్రాజెక్టులో పుష్కలంగా నీరున్నప్ప టికీ ఆయకట్టు రైతాంగం భవితవ్యం ప్రశ్నార్థకం గా మారింది. నిజాంసాగర్‌ ప్రధాన కాల్వల వెంట నీరందించనున్న 49 డిస్ర్టిబ్యూటరీలతోపాటు సీడీ 1, సీడీ 2 డిస్ర్టిబ్యూటరీల కింద వరి సాగు చేయాలని అనుకున్న రైతులు ఇప్పుడిప్పుడే వరి నారు  మళ్లు వేస్తున్నారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు ఉన్న సీడీ 1, సీడీ 2 డిస్ర్టిబ్యూటరీల్లో దాదాపు 600 ఎకరాలతోపాటు మంజీరా పరివాహక ప్రాంతంలో ఉన్న వందలాది ఎకరాల్లో కూడా వరిసాగు చే యాలా? ఆరుతడి పంటలు వేసుకోవాలా? అని రైతులు ఏటూ తేల్చుకోలేకపోతున్నారు. ప్రభుత్వం రైతు బంధు నిధులను విడుదల చేసింది. ఖాతా ల్లో పెట్టుబడి జమైనా ఏ పంటలు వేయాలో తెలియక, ఖరీఫ్‌ హాలిడే ప్రకటించనున్నారు. నిజాం సాగర్‌ ప్రాజెక్టులో పుష్కలంగా నీరున్నా వరి సా గు చేయొదద్దన్న ప్రభుత్వ ఆదేశాలతో రైతులు నిరాశ చెందుతున్నారు. ఆరుతడి పంటలు వేస్తే అనుకూల పరిస్థితలు ఉన్నా పంటకు పెట్టిన పెట్టుబడి రాక నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజాంసాగర్‌ ఆయ కట్టు కింద యాసంగిలో ఏ పంటలు వేస్తారో? అనేది వేచి చూడాల్సిందే. 

Updated Date - 2021-12-30T05:30:00+05:30 IST