వరి కోతలు షురూ

ABN , First Publish Date - 2021-10-22T05:21:11+05:30 IST

జిల్లాలో వరి కోతలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది వానాకాలంలో తెగుళ్లు, తుఫాన్లు, అకాల వర్షాల ను దాటుకొని ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గండాలన్నీ గట్టెక్కాయని అనుకున్న అన్నదాతకు ధాన్యం ఆరబోసేందుకు కల్లాలు కరువయ్యాయి. రోడ్లే దిక్కయ్యాయి.

వరి కోతలు షురూ


కల్లాలు కరువై.. దారులే దిక్కై..
రోడ్లపైనే ధాన్యం ఆరబోత
కొనుగోలు కేంద్రాల కోసం అన్నదాతల ఎదురు చూపులు
దళారుల పాలవుతున్న వైనం
ఇబ్బందులు పడుతున్న రైతులు

నిజామాబాద్‌, అక్టోబరు 21:(ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : జిల్లాలో వరి కోతలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది వానాకాలంలో తెగుళ్లు, తుఫాన్లు, అకాల వర్షాల ను దాటుకొని ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గండాలన్నీ గట్టెక్కాయని  అనుకున్న అన్నదాతకు ధాన్యం ఆరబోసేందుకు కల్లాలు కరువయ్యాయి. రోడ్లే దిక్కయ్యాయి. కొన్ని చోట్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనా కొనుగోళ్లు మాత్రం మందకొడిగానే సాగుతున్నాయి. ఇక జిల్లా అధికారులు కల్లాలకు అనుమతులు ఇచ్చి నా అవి సగం వరకే పూర్తికావడంతో ఎక్కువ మంది రైతులు ధాన్యం ఆరబోసేందుకు తిప్ప లు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాలు ముం దుగా ప్రారంభం కాకపోవడంతో రైతులు పొలా లు, రోడ్లపైనే ధాన్యం కుప్పలను నిల్వ ఉంచు తున్నారు. కొనుగోలు కేంద్రాలను పెంచితే తప్ప రైతులకు ఇబ్బందులు తప్పే పరిస్థితి కనిపించడంలేదు.

కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు..
జిల్లాలో ఈ వానాకాలంలో 3లక్షల 85వేల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. జిల్లాలో పది లక్షల మెట్రిక్‌ టన్నులకుపైగా ధాన్యం ది గుబడి వస్తుందని అధికారులు అంచనా వేశా రు. జిల్లాలో 458 కొనుగోలు కేంద్రాలకు ఏర్పాట్ల ను చేయాలని నిర్ణయించారు. జిల్లాలో అధికారికంగా గురువారం కొనుగోలు కేంద్రాలను స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి ప్రశాంత్‌రెడ్డి తమ నియోజకవర్గాల్లో ప్రారంభించారు. అధికారులు అన్ని మండలాల్లో ప్రారంభించేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు.
దళారుల పాలవుతున్న ధాన్యం..
జిల్లాలోని వర్ని, రుద్రూర్‌, మోస్రా, చందూ ర్‌, కోటగిరి, ఎడపల్లి, నవీపేట, రెంజల్‌, బోధన్‌, నిజామాబాద్‌ రూరల్‌, మోపాల్‌, మాక్లూర్‌, డిచ్‌పల్లి, జక్రాన్‌పల్లి మండలాల పరిధిలో వరి కో తలు ముమ్మరంగా సాగుతున్నాయి. బోధన్‌ డివిజన్‌ పరిధిలో ఇప్పటికే ఎక్కువ మంది రైతులు ధాన్యం వ్యాపారులకు అమ్మేశారు. ప్రభు త్వం ధాన్యం ఏ గ్రేడ్‌ రకం క్వింటాల్‌ రూ.1960, సాధారణ రకం రూ.19 40 నిర్ణయించగా వ్యాపారులు మాత్రం రూ. 1600 వరకే క్వింటాలు కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలను అన్ని గ్రామాల పరిధిలో త్వరగా ప్రారంభిస్తే రైతులకు ఇబ్బందులు తొలగడంతో పాటు మద్దతు ధర వచ్చే అవకాశం ఉంది. జిల్లాలో స్పీకర్‌, మంత్రి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినందున ఒకటి రెండు రోజుల్లో జిల్లాలో మెజార్టీ గ్రామాల్లో ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి తెలిపారు. రైతులకు ఇచ్చే కూపన్‌ల ఆధారంగా కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని తెలిపారు. ఇప్పటికే ధాన్యం కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కల్లాల నిర్మాణాలు పూర్తయితే జిల్లాలో కొంతమేర రైతులకు ఇబ్బందులు తప్పే అవకాశం ఉంది. వచ్చే సీజన్‌ వరకు అయిన ఎక్కువ మొత్తంలో మంజూరు చేసి పూర్తిచేస్తే రైతులకు మేలు జరగనుంది.
సగం కల్లాలే పూర్తి..
జిల్లాలో మొత్తం 3383 కల్లాలను నిర్మాణం కోసం అధికారులు మంజూరు చేశారు. వీటికి ఉపాధిహామీ పథకం కింద అనుమతులు ఇచ్చారు. ప్రతీ గ్రామం పరిధిలో రైతులు తప్పనిసరిగా కల్లాల నిర్మాణం చేసుకోవాలని కోరారు. ఎంతమంది రైతులు అడిగిన కల్లాలను మంజూరు చేసేందుకు అధికారులు అవగాహన కల్పించిన ఎక్కువమంది రైతులు ముందుకురాలేదు. జిల్లాలో మంజూరైన కల్లాల్లో ఇప్పటి వరకు 1469 మాత్రమే పూర్తయ్యాయి. ఇవేకాకుండా మరో 1226 కల్లాలు నిర్మాణంలో ఉన్నాయి. మంజూరైన వాటిలో 688 కల్లాల నిర్మాణం మొదలుపెట్టలేదు. జిల్లాలో ప్రతీ సంవత్సరం విస్తీర్ణం పెరగడం, ధాన్యం అమ్మే సమయంలో ఇబ్బందులు ఎదురవడం వల్ల అధికారులు ఉపాధిహామీ కింద కల్లాలను మొదలుపెట్టినా ఇప్పటి వరకు మాత్రం పూర్తికాలేదు. రైతులు ఎక్కువగా ఆసక్తిచూపకపోడం కూడా నిర్మాణానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
రోడ్లపైనే ఆరబోత..
జిల్లాలో రైతులు గడిచిన 20 రోజుల నుంచి వరి పొలాలను హార్వెస్టర్‌ల ద్వారా కోస్తున్నారు. ధాన్యం ఆరబోసే పరిస్థితి పొలాల్లో లేకపోవడం, కల్లాలు అందరికీ అందుబాటులోకి రాకపోవడంతో ఎక్కువ మంది రోడ్లను ఆశ్రయిస్తున్నారు. వాటిపైనే ధాన్యాన్ని ఆరబోస్తున్నారు. జాతీయ రహదారి మొదలుకొని గ్రామీణ రహదారుల వరకు ఈ దాన్యం ఆరబోస్తున్నారు. జిల్లాలో వరి విస్తీర్ణం బాగా పెరగడం, ఇతర ఆరుతడి పంటలు కూడా రైతులు వేయడం వల్ల పొలాల్లో బురద ఉండడంతో ఇబ్బందులు పడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్లపైన ధాన్యాన్ని ఆరబోస్తున్నారు.

Updated Date - 2021-10-22T05:21:11+05:30 IST