పదోన్నతుల్లో రిజర్వేషన్లు అమలు చేయాలి
ABN , First Publish Date - 2021-01-21T04:28:44+05:30 IST
పదోన్నతుల్లో ఉపాధ్యాయులకు రిజర్వేషన్లను అమలు చేయాలని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అయ్యాల సంతోష్ డిమాండ్ చేశారు.

బాన్సువాడ టౌన్, బాన్సువాడ, జనవరి 20: పదోన్నతుల్లో ఉపాధ్యాయులకు రిజర్వేషన్లను అమలు చేయాలని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అయ్యాల సంతోష్ డిమాండ్ చేశారు. బుధవారం బాన్సువాడ ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా తీసుకవచ్చిన అడక్వసి మెమోను రద్దు చేసి, ప్రమోషన్‌లలో మెరిట్, రోస్టర్ పద్దతులను పాటించాలన్నారు. కార్యక్రమంలో కనిరాం, జ్ఞానేశ్వర్, చంద్రశేఖర్ తదితరులున్నారు.