విద్యుత్‌ అధికారుల తీరుపై ప్రజాప్రతినిధుల ఆగ్రహం

ABN , First Publish Date - 2021-01-21T04:32:01+05:30 IST

విద్యుత్‌ అధికారుల తీరుపై సర్వసభ్వ స మావేశంలో ప్రజా ప్రతినిదులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

విద్యుత్‌ అధికారుల తీరుపై ప్రజాప్రతినిధుల ఆగ్రహం
విద్యుత్‌ అధికారిని ప్రశ్నిస్తున్న సర్పంచ్‌

దోమకొండ, జనవరి 20: విద్యుత్‌ అధికారుల తీరుపై సర్వసభ్వ స మావేశంలో ప్రజా ప్రతినిదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఎంపీపీ కోట సదానంద అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశాన్ని ని ర్వహించారు. సీతారాంపల్లి సబ్‌స్టేషన్‌ నుంచి అంచనూర్‌, సీతారాంపల్లి గ్రామాలకు ఒకటే విద్యుత్‌ ఫీల్టర్‌ ఉండటంతో, అంచనూర్‌కు ఎల్‌సీ తీసుకుంటే సీతారాంపల్లి గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారని సీతా రాంపల్లి సర్పంచ్‌ నాంపల్లి, అంబార్‌పేట సర్పంచ్‌ సలీం పేర్కొన్నారు. విద్యుత్‌శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సభలో విన్న వించారు. సీతారాంపల్లి గ్రామంలో రేషన్‌ డీలర్‌ను ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తీగల తిర్మల్‌గౌడ్‌, ఎంపీ డీవో చిన్నారెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ కుంచాల శేఖర్‌, విండో చైర్మన్‌ పన్యాల నాగరాజ్‌రెడి,్డవైస్‌ ఎంపీపీ పుట్ట బాపురెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-01-21T04:32:01+05:30 IST