కొవిడ్‌ వ్యాక్సిన్‌కు రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి

ABN , First Publish Date - 2021-05-05T05:38:10+05:30 IST

ఆన్‌లైన్‌లో రిజిస్ర్టేషన్‌ చేసుకున్న వారికే కొవిడ్‌ టీకాలు వేయ డం జరుగుతుందని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 45 సంవత్సరాల వయసు పైబడిన ప్రతిఒక్కరూ కొవిన్‌ యాప్‌లో తమ పేరు, వివరాలు నమో దు చేసుకోవాలని, వారికి కేటాయించిన తేదీల్లో సంబంధిత కేంద్రాల్లో టీకాలు ఇవ్వడం జరుగుతుందన్నారు.

కొవిడ్‌ వ్యాక్సిన్‌కు రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి

కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి

నిజామాబాద్‌అర్బన్‌, మే 4: ఆన్‌లైన్‌లో రిజిస్ర్టేషన్‌ చేసుకున్న వారికే కొవిడ్‌ టీకాలు వేయ డం జరుగుతుందని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 45 సంవత్సరాల వయసు పైబడిన ప్రతిఒక్కరూ కొవిన్‌ యాప్‌లో తమ పేరు, వివరాలు నమో దు చేసుకోవాలని, వారికి కేటాయించిన తేదీల్లో సంబంధిత కేంద్రాల్లో టీకాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. జిల్లాలో మొత్తం 42 సెంటర్‌లు ఉన్నాయని, నచ్చినసెంటర్‌ను ఎంపిక చేసుకు ని అక్కడకి వెళ్లి టీకా తీసుకోవచ్చని ఆయన తె లిపారు. ప్రతీరోజు ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు టీకాలు వేస్తారని, 18 సంవత్సరాలు పైబడిన వారికి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చిన తర్వాత టీకాలు వే యడం జరుగుతుందని కలెక్టర్‌ తెలిపారు. 

ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు 

జిల్లాలోని ప్రైవేటు అంబులెన్స్‌ల యజమానులు కొవిడ్‌ బాధితులు, ఇతర ప్రజల నుంచి ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేస్తే వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి హెచ్చరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా తీవ్రతను అవకాశంగా తీసుకుని ప్రజల నుంచి కొందరు అంబులెన్స్‌ యజమానులు అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని ఆయన అన్నారు. అంబులెన్స్‌ల యజమానులు, డ్రైవర్లు తెలంగాణ మోటార్‌ వెహికిల్‌ చట్టం నిబంధనలు, డీ ఎం యాక్ట్‌ 2005 అనుగుణంగా మాత్రమే డ బ్బులు వసూలు చేయాలని కలెక్టర్‌ సూచించా రు. నిబంధనల ప్రకారం డబ్బులు వసూలు చే యకుండా.. అధికంగా డబ్బులు వసూలు చేసే అంబులెన్స్‌ల యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా అంబులెన్స్‌ల డ్రైవర్‌లు అ ధికంగా డబ్బులు వసూలు చేస్తే కరోనా బాధితులైనా, ప్రజలైనా జిల్లా ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ కు ఫిర్యాదు చేయవచ్చని ఆయన తెలిపారు. డ బ్బులు ఎక్కువ ఇవ్వాలని అంబులెన్స్‌ల యజమానులు గానీ, డ్రైవర్‌లుగానీ వేధిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఫిర్యాదుల కోసం జిల్లా ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ 99487 884 45, మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌లు నిజామాబాద్‌ 96663 64494, ఆర్మూర్‌ 73307 71561, బోధన్‌ 83744 88999 నంబర్‌లను సంప్రదించాలని కలెక్టర్‌ తెలిపారు.

Updated Date - 2021-05-05T05:38:10+05:30 IST