లక్ష్యం చేరేనా?

ABN , First Publish Date - 2021-03-22T05:45:50+05:30 IST

పల్లెలే దేశానికి పట్టు కొమ్మ లు, గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశాభివృద్ధి సా ధ్యమవుతుందని అనేది నానుడి. అలాంటి గ్రామ పం చాయతీల అభివృద్ధికి ప్రధాన ఆదాయన వనరు ప న్నుల వసూలు. మేజర్‌ గ్రామ పంచాయతీలను మినా హియిస్తే చాలావరకు పల్లెలకు ఇంటి పన్నులే ఆధారం. ఈ ఆర్థిక సంవత్సరం 2020-21 ముగియడానికి మరో పది రోజులే గడువుఉంది. జిల్లాలో ఇప్పటివరకు కేవ లం 83 శాతం వరకు వసూలయ్యాయి.

లక్ష్యం చేరేనా?



 పన్నుల వసూళ్లకు ఈనెల 31 తుది గడువు

 లక్ష్యం రూ.9.54 కోట్లు

 ఇప్పటివరకు వసూలైంది రూ.7.91 కోట్లు 

 83 శాతం పూర్తి


కామారెడ్డి, మార్చి 21: పల్లెలే దేశానికి పట్టు కొమ్మ లు, గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశాభివృద్ధి సా ధ్యమవుతుందని అనేది నానుడి. అలాంటి గ్రామ పం చాయతీల అభివృద్ధికి ప్రధాన ఆదాయన వనరు ప న్నుల వసూలు. మేజర్‌ గ్రామ పంచాయతీలను మినా హియిస్తే చాలావరకు పల్లెలకు ఇంటి పన్నులే ఆధారం. ఈ  ఆర్థిక సంవత్సరం 2020-21 ముగియడానికి మరో పది రోజులే గడువుఉంది. జిల్లాలో ఇప్పటివరకు కేవ లం 83 శాతం వరకు వసూలయ్యాయి. ఈ ఏడాది గ్రా మాల్లో పల్లె ప్రగతి కార్యక్రమాల్లో అధికారులు బీజీగా గడిపారు. దీంతో పన్ను వసూళ్లలో కొంత వరకుజాప్యం జరిగింది. ప్రస్తుతం పది రోజులే మిగిలి ఉంది. గడువు సమీపిస్తుండడంతో పన్నుల వసూలు లక్ష్యం చేరేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. గ్రామాల్లో ఉదయం నుంచే ఇంటంటికీ తిరుగుతూ సకాలంలో పన్నులు చెల్లించి గ్రామాభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

లక్ష్యం రూ.9.54 కోట్లు

జిల్లాలోని 22 మండలాల్లో 526 గ్రామ పంచాయతీ లు ఉన్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సం బంధించి ఆస్తిపన్ను, పన్నేతర చార్జీల రూపంలో రూ. 9.54 కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా నిర్ణయిం చా రు. ఇప్పటివరకు రూ.7.91 కోట్లు పన్ను వసూలైంది. వీటిలో 362 గ్రామ పంచాయ తీల్లో వందశాతం పన్ను వ సూలైంది. ఈ ఆర్థిక సంవత్స రానికి గాను కామారెడ్డి డివి జన్‌లో 164 గ్రామ పంచా యతీలు ఉండగా రూ.4 కోట్ల 32 లక్షల వసూల లక్ష్యం కాగా రూ.3కోట్ల 44 లక్షలు (79.65శాతం) వసూలయ్యా యి. ఎల్లారెడ్డి డివిజన్‌లో 141 గ్రామపంచాయతీలు ఉం డగా రూ.కోటీ 42 లక్షల వసూళ్ల లక్ష్యం కాగా రూ.కోటీ 26 లక్షల(88.90 శాతం) వసూలయ్యాయి. బాన్సువాడ డివిజన్‌లో 221 గ్రామపంచాయతీలు ఉండగా రూ.3.79 కోట్ల లక్ష్యం కాగా రూ.3.20 కోట్ల వసూలయ్యాయి.

 నిర్వహణ ఇలా.. 

పల్లెలో పారిశుధ్యం, తాగునీరు, వీధిదీపాల నిర్వ హణ, సిబ్బంది జీతాభత్యాలు, తదితర పనులు కోసం పన్నుల రూపంలో వచ్చిన నిధులను ఖర్చు చేస్తారు. ఇ ప్పటికే పల్లె ప్రగతి పనుల నిర్వహణ, ట్రాక్టర్‌, వాటర్‌ ట్యాంకుల నిర్వహణతో పాటు మల్టీపర్పస్‌ వర్కర్లకు వే తనాలు ఇచ్చేందుకే ప్రభుత్వం కేటాయించిన నిధులు సరిపోతున్నాయి. గ్రామపంచాయతీకి ట్యాక్స్‌ల రూ పం లో ఆదాయం రావడంతో గ్రామాల్లో చిన్నచిన్న ప నుల నిర్వహణ కోసం వినియోగించే అవకాశం ఏర్ప డుతుం ది. ఇప్పటికి దాదాపు అన్ని గ్రామ పంచాయతీలకు కార్యదర్శు లను నియమిం చిన నేపథ్యంలో ఎంతవరకు పన్నులు వసూలు చేసా ్తరో చూడాల్సి ఉంది. పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం వహిం చిన సిబ్బందిపై శాఖా పరమైన చర్యలు తప్పవని జిల్లా స్థాయి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

వందశాతం వసూలు చేస్తాం 

- సాయన్న, డీపీవో, కామారెడ్డి

జిల్లాలో ఈ నెల 31లోగా వందశాతం పన్నులు వసూలు చేస్తాం. ఇప్పటివరకు  గడువులోగా పన్నులు వసూలు చేయాలని పంచాయతీ సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం. కామారెడ్డి డివిజన్‌లో 79.65 శాతం, ఎల్లారెడ్డి డివిజన్‌లో 88.90, బాన్సువాడ డివిజన్‌లో 84.3 శాతం పన్ను వసూళ్లు చేశాం. జిల్లాలో మొత్తం 83 శాతం పన్ను వసూలు చేయగా 362 జీపీలలో వంద శాతం పన్ను వసూలు చేశాం. ఎప్పటికప్పుడు పన్నుల సేకరణ వివరాలు తెలుసుకుంటున్నాం. ప్రజలంతా పన్నులు చెల్లించి సహకరించాలి.


Updated Date - 2021-03-22T05:45:50+05:30 IST