బీజేపీ ఆధ్వర్యంలో రాస్తారోకో
ABN , First Publish Date - 2021-02-27T05:02:34+05:30 IST
మండల కేంద్రంలో శుక్రవారం టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు చేసిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది.

రుద్రూరు, ఫిబ్రవరి 26 : మండల కేంద్రంలో శుక్రవారం టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు చేసిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. బీ జేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్, ఎంపీ అర్వింద్ దిష్టిబొమ్మలను ఉరితీయడాన్ని నిరసిస్తూ బీజేపీ రుద్రూరు మండల నాయకులు రుద్రూ రు-బోధన్ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దాదాపు రెం డు గంటల వరకు రాస్తారోకో చేపట్టారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బీజేపీ నాయకులకు నచ్చజెప్పారు. వినకపోయేసరికి అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కి తరలించారు. అనంతరం బీజేపీ నాయకుడు మ ల్యాద్రిరెడ్డి పోలీస్‌స్టేషన్‌లోనే విలేకరులతో మాట్లాడుతూ బాన్సువా డలో జరిగిన సభను చూసి టీఆర్‌ఎస్ నాయకుల గుండెల్లో గుబులు పు ట్టిందని బండిసంజయ్, అర్వింద్ మాట్లాడిన మాటల్లో అంతా నిజమే ఉందని అన్నారు. నిరసన కార్యక్రమాలు ప్రజాస్వామ్యంగా చేయాలని ఇలా రెచ్చగొట్టే విధంగా ఉరితీయడం ఏంటని మండిపడ్డారు. టీఆర్‌ఎస్ నాయకులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్ర మంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు దొరబాబు, పార్టీ కోటగిరి మండలా ధ్యక్షుడు గాండ్ల శ్రీను, ఎముల నవీన్, మంజునాథ్, రుద్రశివ, మామిడి శ్రీను, ధర్మారం వెంకటేశం, సుధాకర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.