రైల్వే పోలీసుల తనిఖీలు
ABN , First Publish Date - 2021-11-06T05:16:23+05:30 IST
ఉమ్మడి జిల్లా నుంచి రైళ్ల ద్వారా గంజాయి అక్రమ రవాణా జరుగకుండా రైల్వే పోలీసులు శుక్రవారం తనిఖీలు చేపట్టారు.

ఖిల్లా,నవంబరు 5 : ఉమ్మడి జిల్లా నుంచి రైళ్ల ద్వారా గంజాయి అక్రమ రవాణా జరుగకుండా రైల్వే పోలీసులు శుక్రవారం తనిఖీలు చేపట్టారు. రాష్ర్టాన్ని గంజాయి రహితంగా మార్చాలని సీఎం కేసీఆర్, రైల్వేస్ సీపీ ఇచ్చిన ఆదేశాల మేరకు రైల్వే పోలీసులు శుక్రవారం సాయంత్రం దేవగిరి ఎక్స్‌ప్రెస్ రైలును తనిఖీ చేశారు. అనుమానాస్పదంగా వెళ్లే వారి లగేజిని పరిశీలించారు. వారి పూర్తి వివరాలను సేకరించారు. ఈ తనిఖీల్లో రైల్వే ఎస్సై బి. ప్రణయ్‌కుమార్, పోలీసు సిబ్బందితో పాటు ఆర్‌పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.