తెలంగాణలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని నిరసన
ABN , First Publish Date - 2021-05-13T05:38:07+05:30 IST
తెలంగాణలో తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని న్యూడెమోక్రసీ బోధన్ సబ్ డివిజన్ కార్యదర్శి మల్లేష్ డిమాండ్ చేశారు. పట్ట ణంలోని పాన్‌గల్లిలో నిరసన చేపట్టారు.

బోధన్, మే 12 : తెలంగాణలో తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని న్యూడెమోక్రసీ బోధన్ సబ్ డివిజన్ కార్యదర్శి మల్లేష్ డిమాండ్ చేశారు. పట్ట ణంలోని పాన్‌గల్లిలో నిరసన చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ప్రకటించడంతోపాటు హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. రా ష్ట్రంలో కరోనాతో అనేక మంది పేదలు పిట్టలా రాలిపోతున్నారని మండిపడ్డా రు. పేద కుటుంబాలు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లలేక ప్రాణాలు కోల్పోతు న్నారన్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి తక్షణమే పేదలకు ఉచిత వైద్యం అందించాలన్నారు. కార్యక్రమంలో రైతు కూలీ సంఘం నాయకులు పడాల శంకర్, నాగమణి, సాయిలు, గంగాధర్, పోశెట్టి, నీలకంఠం, పీరయ్య, శంకర్, పార్వతి, గంగామణి, లలిత, బాలమణి తదితరులు పాల్గొన్నారు.
కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి..
కమ్మర్‌పల్లి: ప్రజల ప్రాణాలను హరిస్తున్న కరోనాను ఆరోగ్యశీలో చేర్చి అం దరికీ మెరుగైన వైద్యసదుపాయాలు అందించాలని డిమాండ్ చేస్తూ బుఽధ వారం కమ్మర్‌పల్లి మండల కేంద్రంలో సీపీఐఎంల్ న్యూడెమెక్రసీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం ఎదుట ఫ్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. అ సందర్భం గా మాట్లాడుతూ ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగానే కరోనా విజృంభిస్తూ ప్రాణాలను హరిస్తుందని ఇవన్నీ ప్రభుత్వ హత్యలెనన్నారు. లాక్‌డౌన్ కార ణంగా ఉపాధికోల్పోతున్న తెల్లరేషన్ కార్డుదారుకు ఉన్న ప్రతీ కుటుంబానికి రూ.7 వేలు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు సారా సురేష్, జి సత్యనారాయణ, వి.బాలయ్య, జి. కిషన్, రాజగంగారాం, భానుచందర్, సత్తెక్క తదితరులు పాల్గొన్నారు.