టీఆర్‌ఎస్‌ పాలనలో పల్లెల్లో ప్రగతి పరుగులు : జడ్పీ చైర్మన్‌

ABN , First Publish Date - 2021-02-09T05:04:37+05:30 IST

సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలో పల్లెల్లో ప్రగతి పరుగులు పెడుతుందని దేశంలో ఎక్కడ జరగనన్ని అభివృద్ధి పనులు మన రాష్ట్రంలో జరుగుతున్నాయని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావ్‌ అన్నారు.

టీఆర్‌ఎస్‌ పాలనలో పల్లెల్లో ప్రగతి పరుగులు : జడ్పీ చైర్మన్‌

మాక్లూర్‌, ఫిబ్రవరి 8:  సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలో పల్లెల్లో ప్రగతి పరుగులు పెడుతుందని దేశంలో ఎక్కడ జరగనన్ని అభివృద్ధి పనులు మన రాష్ట్రంలో జరుగుతున్నాయని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావ్‌ అన్నారు. సోమవారం మాక్లూర్‌ మండలంలోని వెంకటాపూర్‌ , రాంపూర్‌ గ్రామాల్లో 15వ ఆర్థిక సంఘం, జడ్పీ, ఈజీఎస్‌ నిధులతో అంగన్‌వాడి భవనం, సీసీరోడ్డు, సీసీడ్రైనేజీతోపాటు ఆలయ అభివృద్ధి పనులకు ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లెలే దేశానికి పట్టుకొమ్మలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ గ్రామాలను ప్రగతిపథంలో నడిపిస్తున్నారన్నారు. 60 ఏళ్లలో జరగని అభివృద్ధి టీఆర్‌ఎస్‌ 7ఏళ్ల పాలనలో జరిగిందన్నారు. గ్రామాలు అభివృద్ధి బాటలో నడవాలంటే సప్రజలంతా ఐకమత్యంతో ఉండాలని ఎన్నికలప్పుడే పార్టీలని ఎన్నికల తర్వాత అభివృద్ధే ధ్యేయంగా ముందుకు వెళ్లాలన్నారు. వెంకటాపూర్‌ , రాంపూర్‌ గ్రామాలు తనకు రెండుకళ్లని భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను ఈ గ్రామాల్లో నిర్వహిస్తామన్నారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత సహకారంతో జిల్లాలో గ్రామాల అభివృద్ధికి కృషిచేస్తానన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో సక్రియానాయక్‌, ఎంపీవో రమణ, కేసీఆర్‌ సేవాదళం జిల్లా అధ్యక్షుడు రమణరావు, సర్పంచ్‌ భవాని రఘు, ఎంపీటీసీ సత్తెమ్మ రవి, ఉప సర్పంచ్‌ లావణ్య, సాయిలు, నాయకులు సందీప్‌రావు, అంజయ్య, శంకర్‌, నాగారావు, జలపతిరావు, విఠల్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-09T05:04:37+05:30 IST