గ్రామాల్లో సమస్యలను వెంటనే పరిష్కరించాలి

ABN , First Publish Date - 2021-02-02T05:21:50+05:30 IST

గ్రామాల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ ఆదేశించారు. స్థానిక మండల పరిషత్‌ కా ర్యాలయంలో సోమవారం ఎంపీపీ రవి అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశా నికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

గ్రామాల్లో సమస్యలను వెంటనే పరిష్కరించాలి
చెక్కులను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే సురేందర్‌

తాడ్వాయి, ఫిబ్రవరి 1: గ్రామాల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ ఆదేశించారు. స్థానిక మండల పరిషత్‌ కా ర్యాలయంలో సోమవారం ఎంపీపీ రవి అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశా నికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఎర్రాపహాడ్‌, కృష్ణాజివాడి, కరడ్‌ప ల్లి, చిట్యాల గ్రామాల్లో విద్యుత్‌ సమస్యలు ఉన్నాయని సర్పంచ్‌లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, అధికారులు పద్దతి మార్చుకోవాలని సూచించారు. చిట్యాల, కరడ్‌పల్లి, దే మెకలాన్‌ గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులను పరిష్కరించాలని తెలిపారు. అనంతరం శ్రీశబరిమాత కుంటలో మునుగుతున్న భూముల రైతులకు రూ.96 లక్షల చెక్కులతో పాటు కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ చెక్కులను అందించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ రమాదేవి, డీసీఎంఎస్‌ డైరెక్టర్‌ నల్లవెల్లి కపిల్‌రెడ్డి, సీడీసీ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి, టీఆ ర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సాయిరెడ్డి, ఆర్డీవో శ్రీను తదితరులు పాల్గొన్నారు.

స్లాటర్‌ హౌస్‌ నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే 

నాగిరెడ్డిపేట: మండలకేంద్రంలో గోపాల్‌ పేటలో నిర్మిస్తున్న స్లాటర్‌ హౌస్‌ నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. గతంలోనే రెండు గదులను నిర్మించగా, ప్రస్తుతం గ్రామ పంచాయతీ నిధుల ద్వారా సుమారు 4 లక్షల వ్యయంతో రేకులతో మరో నా లుగు గదులను ఏర్పాటు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మనోహర్‌ రెడ్డి, ప్రతాప్‌ రెడ్డి, నర్సింలు, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.   


Updated Date - 2021-02-02T05:21:50+05:30 IST