రెండో దశ వ్యాక్సినేషన్‌కు సన్నద్ధం
ABN , First Publish Date - 2021-02-02T05:13:18+05:30 IST
రెండో దశ కొవిడ్ వ్యాక్సినేషన్‌కు కామారెడ్డి జిల్లా యం త్రాంగం సన్నద్ధమవుతోంది. ఇప్పటికే హెల్త్‌కేర్, అంగన్‌వాడీ సిబ్బందికి టీకా అందజేయడంతో మొదటిదశ వ్యాక్సినేషన్ పూర్తయింది. టీకా తీసుకునేందుకు వచ్చే వారందరికీ వ్యాక్సి న్ ఇస్తుండగా తీసుకునేందుకు ముందుకు రాని వారికి అవ గాహన, భరోసా కల్పిస్తూ టీకాలు వేశారు. మొదటి దశ విజ యవంతంగా పూర్తవడంతో త్వరలో రెండోదశలో రెవెన్యూ, పోలీస్, పారిశుధ్య కార్మికులకు వ్యాక్సిన్ వేయనున్నారు.

త్వరలో పోలీసు, రెవెన్యూ సిబ్బంది, పారిశుధ్య కార్మికులకు కొవిడ్ టీకా
కామారెడ్డి, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): రెండో దశ కొవిడ్ వ్యాక్సినేషన్‌కు కామారెడ్డి జిల్లా యం త్రాంగం సన్నద్ధమవుతోంది. ఇప్పటికే హెల్త్‌కేర్, అంగన్‌వాడీ సిబ్బందికి టీకా అందజేయడంతో మొదటిదశ వ్యాక్సినేషన్ పూర్తయింది. టీకా తీసుకునేందుకు వచ్చే వారందరికీ వ్యాక్సి న్ ఇస్తుండగా తీసుకునేందుకు ముందుకు రాని వారికి అవ గాహన, భరోసా కల్పిస్తూ టీకాలు వేశారు. మొదటి దశ విజ యవంతంగా పూర్తవడంతో త్వరలో రెండోదశలో రెవెన్యూ, పోలీస్, పారిశుధ్య కార్మికులకు వ్యాక్సిన్ వేయనున్నారు. ఈ నెల రెండో వారంలో వీరికి టీకా వేసేందుకు ఏర్పాట్లు జరు గుతున్నాయి. ఆయా విభాగాలకు చెందిన సిబ్బంది సమగ్ర సమాచారాన్ని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సేకరిస్తూ కొవి డ్ యాప్‌లో నమోదుచేస్తున్నారు. కరోనా వైరస్ నియంత్రణ లో హెల్త్‌కేర్ సిబ్బంది తర్వాత ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా పి లుచుకుంటున్న రెవెన్యూ, పోలీస్, పారిశుధ్య కార్మికులు కీల కపాత్ర పోషించారు. ఇందుకు గుర్తింపుగా రెండోదశ వ్యాక్సినే షన్‌లో కేంద్రప్రభుత్వం వీరికి ప్రాధాన్యతను ఇస్తోంది. కేంద్ర ం సూచించిన మేరకు టీకా అందజేసేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
సమాచార సేకరణ
రెవెన్యూ, పోలీసు ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులు కా మారెడ్డి జిల్లాలో అధిక సంఖ్యలోనే ఉన్నారు. జిల్లా పరిధిలో ని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ డివిజన్‌ల పరిధిలో 23 పోలీస్ స్టేషన్‌లు ఉన్నాయి. అన్ని క్యాడర్‌లలో కలిపి సుమా రు 4 వేల మంది పోలీసు ఉద్యోగులు ఉంటారని అంచనా. అలాగే జిల్లాలోని మూడు మున్సిపాలిటీలు ఉండగా ఇందు లో సుమారు 600 వరకు మున్సిపల్ కార్మికులు, అధికారులు ఉద్యోగులు ఉంటారని అంచనా. దీంతోపాటు రెవెన్యూ శాఖ లో సుమారు 1,200 మంది వరకు ఉంటారు. వీరందరి వివ రాలు ప్రత్యేక ఫార్మెట్‌లో ఆయా శాఖలు సేకరిస్తున్నాయి. ఈ వివరాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు అప్పగిస్తే వారు కొవిడ్ యాప్‌లో నమోదు చేస్తారు. ఇప్పటివరకు ఈ మూ డు శాఖలకు చెందిన సుమారు 500 మంది ఉద్యోగుల వివ రాలను ఈ యాప్‌లో ఎంట్రీ చేసినట్లు తెలిసింది.
మొదటి దశలో 3795 మందికి వ్యాక్సినేషన్
జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ డివిజన్‌ల ప రిధిలో ఇప్పటికే మొదటిదశ వ్యాక్సినేషన్‌ను వైద్యఆరోగ్యశాఖ విజయవంతంగా పూర్తిచేసింది. జిల్లాలో ఇప్పటివరకు మొ త్తం 3,795 మంది కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను తీసుకున్నారు. మొద టిదశలో భాగంగా జిల్లాలోని వైద్యఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలకు, ప్రైవేట్ వైద్యులు, సిబ్బ ందికి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదటిదశ లో జిల్లా వ్యాప్తంగా 5,214 మంది ప్రభుత్వ, ప్రైవేటు వై ద్యాధికారులు, సిబ్బందితో పాటు అంగన్‌వాడీ కార్యకర్తలు కొ విన్‌యాప్‌లో ఎండ్రోల్‌మెంట్ చేయించుకున్నారు. గతనెల 16వ తేదీన ప్రారంభమైన మొదటిదశ వ్యాక్సినేషన్ 29న పూ ర్తయింది. ప్రభుత్వ వైద్యఆరోగ్యశాఖలోని వైద్యులు, సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలు మొత్తం 4,366 మంది కొవిన్ యా ప్‌లో ఎండ్రోల్‌మెంట్ చేసుకోగా.. ఇందులో 3,227 మంది వ్యా క్సిన్ తీసుకున్నారు. 73.91 శాతం వ్యాక్సినేషన్ అయింది. అదే విధంగా ప్రైవేట్ ఆసుపత్రులకు చెందిన వైద్యులు, సిబ్బంది 848 మంది ఎన్‌రోల్‌మెంట్ చేసుకోగా 568 మంది టీకాలు తీసుకోవడంతో 66.98 శాతం నమోదైంది. కొందరు టీకాలు తీసుకునేందుకు ఆసక్తి చూపలేదని, మరికొందరు వివిధ అ నారోగ్యకారణాలతో టీకాలు వేయించుకోలేదని వైద్యధికారు లు పేర్కొన్నారు. అయినప్పటికి టీకాపై అవగాహన కల్పిస్తూ భరోసా ఇస్తున్నారు.
ప్రైవేటు ఆసుపత్రులకు సైతం అనుమతి?
జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ పంపిణీ చేసేందుకు ప్రైవేటు ఆసుపత్రులకు సైతం అనుమతులు ఇచ్చే అవకాశాలు ఉ న్నాయి. ఇప్పటికే మొదటిదశలో వ్యాక్సినేషన్ కార్యక్రమం చే పట్టినందున జిల్లాలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో టీకా వేసేందు కు వైద్యఆరోగ్యశాఖ అనుమతి ఇచ్చింది. మొదటి దశలో జి ల్లా కేంద్రంలోని జీవదాన్ ఆసుపత్రిలో పలువురు వైద్య సిబ్బ ందికి టీకాలు వేశారు. అయితే రెండో దశలో టీకాలు వేయిం చుకునే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున మరిన్ని ప్రైవేటు ఆసుపత్రులకు అనుమతులు ఇచ్చే అవకాశాలు ఉ న్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ప్రస్తుతం కామారెడ్డి జిల్లా ఆసు పత్రితో పాటు బాన్సువాడ, ఎల్లారెడ్డి ఏరియా ఆసుపత్రులు, 21 పీహెచ్‌సీ, 6 సీహెచ్‌సీలలో ఇప్పటికే టీకా వేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో కొవిషీల్డ్ టీకాను మాత్రమే వేస్తున్నారు.
మొదటి దశ వ్యాక్సినేషన్ పూర్తి
చంద్రశేఖర్, డీఎంహెచ్‌వో, కామారెడ్డి
జిల్లాలో మొదటిదశ వ్యాక్సినేషన్ పూర్తయింది. మొదటిద శలో మొత్తం 3,795 మందికి వ్యాక్సినేషన్ చేశాం. జిల్లా వ్యా ప్తంగా 5,214 మంది సిబ్బందిని గుర్తించగా.. అందులో 3,22 7 మంది ప్రభుత్వ వైద్య సిబ్బంది, 568 ప్రైవేటు ఆసుపత్రి సిబ్బందికి వ్యాక్సినేషన్ చేశాం. ప్రస్తుతం రెవెన్యూ, పోలీస్, పారిశుధ్య సిబ్బందికి సంబంధించిన వివరాలు సేకరించే ప నిలో ఉన్నాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే వారికి సై తం వ్యాక్సినేషన్ వేస్తాం.