ఆన్‌లైన్‌లో విద్యుత్‌ బిల్లులు చెల్లించాలి

ABN , First Publish Date - 2021-05-13T05:45:09+05:30 IST

ఆన్‌లైన్‌ ద్వారా, ఆన్‌లైన్‌ యాప్‌ల ద్వారా విద్యుత్‌ బిల్లులు చెల్లించాలని జిల్లా విద్యుత్‌శాఖ అధికారి సుదర్శనం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఆన్‌లైన్‌లో విద్యుత్‌ బిల్లులు చెల్లించాలి

సుభాష్‌నగర్‌, మే 12: ఆన్‌లైన్‌ ద్వారా, ఆన్‌లైన్‌ యాప్‌ల ద్వారా విద్యుత్‌ బిల్లులు చెల్లించాలని జిల్లా విద్యుత్‌శాఖ అధికారి సుదర్శనం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో విద్యుత్‌ వినియోగదారులు ఇంటి వద్దనే ఉండి టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌యాప్‌, ఫోన్‌పే, అమెజాన్‌పే, పేటీఎం, టీవ్యాలెట్‌ యాప్‌ల ద్వారా విద్యుత్‌ బిల్లులు చెల్లించాలని కోరారు. ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించడం వీలుకాకపోతే ఉదయం 6 నుంచి 10గంటల వరకు జిల్లాలోని అన్ని విద్యుత్‌ చెల్లింపు కేంద్రాలు తెరచి ఉంటాయని, ఈ విషయాన్ని విద్యుత్‌ వినియోగదారులు గమనించి సకాలంలో విద్యుత్‌ బిల్లులు చెల్లించాలని కోరారు.


Updated Date - 2021-05-13T05:45:09+05:30 IST