ఆరోగ్యమైన జీవితం కోసం ఆర్గానిక్‌ ఉత్పత్తులు వాడాలి

ABN , First Publish Date - 2021-02-16T06:41:10+05:30 IST

ప్రజలు ఆరోగ్యవంతమైన జీవితం గడపటం కోసం ఆర్గానిక్‌ ప్రాడక్ట్స్‌ను వాడాలని రాష్ట్ర బీసీ సంక్షే మ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ కోరారు.

ఆరోగ్యమైన జీవితం కోసం ఆర్గానిక్‌ ఉత్పత్తులు వాడాలి
కేంద్రాన్ని ప్రారంభిస్తున్న మంత్రులు, ఎమ్మెల్సీలు

నందిపేట, ఫిబ్రవరి15: ప్రజలు ఆరోగ్యవంతమైన జీవితం గడపటం కోసం ఆర్గానిక్‌ ప్రాడక్ట్స్‌ను వాడాలని రాష్ట్ర బీసీ సంక్షే మ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ కోరారు. సోమవారం రా త్రి లక్కంపల్లి గ్రామ శివారులో స్మార్ట్‌ ఆగ్రో ఇండస్ట్రీస్‌లో ఏ ర్పాటు చేసిన బయో ప్లాస్టిక్‌ కేంద్రాన్ని మంత్రి ప్రశాంత్‌ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి, ఎమ్మెల్సీ ఆకుల లలితతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశం లో మంత్రి మాట్లాడారు. ఇండస్త్రీ ఏర్పాటు కోసం కేంద్రం నాలుగేళ్లకు అనుమతి ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం నాలుగు రోజుల్లోనే అనుమతి ఇచ్చిందన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌ రావు, ఎంపీపీ వాకిడి సంతోష్‌ రెడ్డి, జడ్పీటీసీ యమున పాల్గొన్నారు.

సిద్దులగుట్ట శివాలయంలో ప్రత్యేక పూజలు

ఆర్మూర్‌టౌన్‌: సిద్దులగుట్ట శివాలయంలో సోమవారం మం త్రులు ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్‌, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఆకుల లలిత పూజలు చే శారు. సిద్దులగుట్ట ఘాట్‌రోడ్డు నిర్మాణానికి మంత్రి ప్రశాంత్‌ రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. 

Updated Date - 2021-02-16T06:41:10+05:30 IST