కొనసాగుతున్న వెంకన్న బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2021-10-20T05:12:38+05:30 IST

మండలంలోని ఏడో పోలీసు బెటాలియన్‌ పరిధి లో గల శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామివారికి నిత్యవాహనం, బలిహారనం, వసంతోత్సవం, ఆరాధన, కార్యక్ర మాలను కమాండెంట్‌ సతీమని వర్ధినిసత్యశ్రీనివాస్‌రావు నిర్వహించారు.

కొనసాగుతున్న వెంకన్న బ్రహ్మోత్సవాలు
హోమం చేస్తున్న కమాండెంట్‌ దంపతులు

హోమంలో పాల్గొన్న కమాండెంట్‌ దంపతులు
డిచ్‌పల్లి, అక్టోబరు 19: మండలంలోని ఏడో పోలీసు బెటాలియన్‌ పరిధి లో గల శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామివారికి నిత్యవాహనం, బలిహారనం, వసంతోత్సవం, ఆరాధన, కార్యక్ర మాలను కమాండెంట్‌ సతీమని వర్ధినిసత్యశ్రీనివాస్‌రావు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నదానం చేశారు. ఈ సందర్భంగా కమాండెంట్‌ మాట్లాడుతూ ఈసారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవం గా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బెటాలియన్‌ అధికా రులు వెంకటేశ్వర్లు, నరేష్‌, సర్ధార్‌, ఆర్‌ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-10-20T05:12:38+05:30 IST