కొనసాగుతున్న సర్వే

ABN , First Publish Date - 2021-05-21T05:37:32+05:30 IST

కరోనా నివారణకు ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య సర్వే రూరల్‌ మండలంలో జరుగుతున్న విధానాన్ని అదనపు కలెక్టర్‌ బీఎస్‌ లత పరిశీలించారు.

కొనసాగుతున్న సర్వే
కరోనా సర్వేను పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్‌ బీఎస్‌ లత


నిజామాబాద్‌ రూరల్‌, మే 20: కరోనా నివారణకు ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య సర్వే రూరల్‌ మండలంలో జరుగుతున్న విధానాన్ని అదనపు కలెక్టర్‌ బీఎస్‌ లత పరిశీలించారు. గురువారం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. మల్కాపూర్‌ (ఎ), గాంధీనగర్‌ తండా గ్రామాల్లో జరుగుతున్న ఇంటింటి జ్వర సర్వేను దగ్గరుండి గమనించారు. ఆరోగ్య సిబ్బంది పేషెంట్లకు ఇస్తున్న సూచనలు, కరోనా లక్షణాలున్న వ్యక్తులను వారి ఇంటి వద్దకు వెళ్లి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు. వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య సిబ్బంది జ్వర లక్షణాలున్నవారిపట్ల చూపుతున్న శ్రద్దపట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా తొలిదశలోనే వాటి లక్షణాలను గుర్తిస్తే కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చని సూచించారు. జ్వర సర్వే వల్ల సత్ఫలితాలు వస్తున్నాయని సిబ్బంది, రోగులు సైతం అదనపు కలెక్టర్‌కు తెలిపారు. ఆయా గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులను, గ్రామాల్లో పెంచుతున్న నర్సరీలోని మొక్కలను పరిశీలించారు. కలెక్టర్‌తోపాటు ఎంపీడీవో మల్లేష్‌, ఎంపీవో మధురిమ,  పంచాయతీ కార్యదర్శులు వెంకటేష్‌, ఆనంద్‌,  వైద్య బృందం ఏఎన్‌ఎంలు అనిత, సునీత, ఆశ వాలంటీర్‌లు రాణి, ధనలక్ష్మి, లావణ్య, అంగన్‌వాడీ టీచర్‌లు ఇందిర, జ్యోతి తదితరులు తదితరులున్నారు.
మల్కాపూర్‌ తండాలో జరుగుతున్న ఆరోగ్యసర్వేను ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ పర్యవేక్షించారు. గ్రామంలో ఇంటింటి సర్వే జరుగుతున్న వ్యక్తుల వద్దకు వెళ్లి సర్వేను పరిశీలించారు. గ్రామ పెద్దలు ప్రకాష్‌నాయక్‌, సెక్రటరీ సంతోష్‌లను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
ఆరోగ్య సర్వేను పరిశీలించిన అదనపు కలెక్టర్‌
ఆర్మూర్‌ : పట్టణంలో ఆరోగ్య సర్వేను గురువారం అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సర్వేను పకడ్భందీగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. ప్రతీ ఇంటిలో అందరి ఆరోగ్యం తెలుసుకోవాలన్నారు. అదనపు కలెక్టర్‌ వెంట ఆర్డీవో శ్రీనివాసులు, ఇతర అధికారులు ఉన్నారు.

Updated Date - 2021-05-21T05:37:32+05:30 IST