కొనసాగుతున్న సింగీతం నీటి విడుదల

ABN , First Publish Date - 2021-08-21T04:37:44+05:30 IST

ఉభయ జిల్లాల వర ప్రదాయిని అయి న నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి 836 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది.

కొనసాగుతున్న సింగీతం నీటి విడుదల
ప్రధాన కాల్వలోకి వెళుతున్న దృశ్యం

నిజాంసాగర్‌, ఆగస్టు 20: ఉభయ జిల్లాల వర ప్రదాయిని అయి న నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి 836 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. పూర్తి నీటి సామర్థ్యం 1405 అడుగులకు గాను 1397.74 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం 9.094 టీఎంసీలకు నీటి నిల్వలు చేరుకున్నాయి. ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 17.802 టీఎంసీలకు గాను ప్రస్తుతం 10 టీఎంసీలకు చేరువలో ఉన్నాయి. మరో 7 టీఎంసీల నీరు వచ్చి చేరితే పూర్తి నీటి సామర్థ్యానికి చేరుకుంటుందని ప్రాజెక్టు అధికారి శ్రావణ్‌కుమార్‌ తెలిపారు. సింగీతం రిజర్వాయర్‌లోకి 323 క్యూసెక్కుల నీరు ఎగువ ప్రాంతం నుంచి వస్తుండ టంతో ఆ ప్రాజెక్టు నీటి సామర్థ్యాన్ని 416.500 మీటర్ల నీటి ని నిల్వ చేస్తూ ఎగువ నుంచి వస్తున్న వరద గేట్ల ద్వారా 221 క్యూసెక్కుల నీటిని నిజాంసాగర్‌ ప్రధాన కాల్వ ద్వారా విడుదల చేస్తున్నారు. 102క్యూసెక్కుల నీరు అలుగు ద్వారా ఉరకలు వేస్తోంది. వర్షాలు ఇలాగే కొనసాగితే నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి మరింత నీరు వచ్చి చేరితే వర్షాకాలం చివరి నాటికి ప్రాజెక్టు నిండవచ్చని రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-08-21T04:37:44+05:30 IST