కొనసాగుతున్న ఇంటర్‌ పరీక్షలు

ABN , First Publish Date - 2021-10-29T05:40:34+05:30 IST

జిల్లావ్యాప్తంగా 4వ రోజు గురువారం ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్ష ప్రశాంతంగా జరిగింది.

కొనసాగుతున్న ఇంటర్‌ పరీక్షలు


నిజామాబాద్‌అర్బన్‌, అక్టోబరు 28: జిల్లావ్యాప్తంగా 4వ రోజు గురువారం ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్ష ప్రశాంతంగా జరిగింది. జిల్లావ్యాప్తంగా 71 పరీక్ష కేంద్రాలలో నిర్వహించిన మ్యాథ్స్‌ -బీ, జువాలజీ, హిస్టరీ పరీక్షకు మొత్తం 15245 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా, 838 మంది గైర్హాజరుకాగా 14407 మంది పరీక్ష రాశారు. ఇందులో జనరల్‌ విద్యార్థులు 13032 మంది ఉండగా ఇందులో 574 మంది పరీక్షకు హాజరుకాకపోగా 12458 మంది పరీక్ష రాశారు. ఒకేషనల్‌ విద్యార్థులు 2213 మందికాగా 264 మంది పరీక్షకు హాజరుకాలేదు. 1949 మంది పరీక్ష రాశారు. డీఈసీ 8 పరీక్ష కేంద్రాలను, హెచ్‌పీసీ5 పరీక్ష కేంద్రాలను, ఫ్లయింగ్‌, సిట్టింగ్‌ స్క్వాడ్‌ బృందాలు 33 పరీక్ష కేంద్రాలను, డీఐఈవో ఆర్మూర్‌లోని ప్రభు త్వ బాలుర, బాలికల కళాశాల, సాంఘిక సంక్షేమ కళాశాల, క్షత్రియ కళాశాల, సీవీఆర్‌ కళాశాలలను తనిఖీ చే శారు.

Updated Date - 2021-10-29T05:40:34+05:30 IST