పోచంపాడ్‌లో డివైడర్‌ను ఢీకొని ఒకరి మృతి
ABN , First Publish Date - 2021-12-26T05:56:17+05:30 IST
మండలంలో పోచంపాడ్ గ్రామానికి చెందిన షేక్ ముస్తాక్ హుస్సేన్(40) ద్విచక్రవాహనంపై వెళ్తుండగా డివైడర్‌ను ఢీకొని మృతి చెందినట్టు ఎస్సై శ్రీధర్‌రెడ్డి తెలిపారు.

మెండోర, డిసెంబరు25: మండలంలో పోచంపాడ్ గ్రామానికి చెందిన షేక్ ముస్తాక్ హుస్సేన్(40) ద్విచక్రవాహనంపై వెళ్తుండగా డివైడర్‌ను ఢీకొని మృతి చెందినట్టు ఎస్సై శ్రీధర్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ముస్తాక్ పని నిమిత్తం పోచంపాడ్ ఎక్స్‌రోడ్డు వద్దకు వెళ్లి తిరుగు ప్రయాణంలో బైక్‌ను అతివేగంతో నడపడంతో ప్రాథమిక పాఠశాల వద్ద డివైడర్‌ను ఢీకొట్టడంతో కింద పడడంతో బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందినట్టు ఎస్సై తెలిపారు. మృతునికి ముగ్గురు పిల్లలు ఉన్నారని, భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.