కుంట కబ్జాపై అధికారుల దృష్టి

ABN , First Publish Date - 2021-10-30T05:20:52+05:30 IST

పట్టణంలోని సాతెల్లి బేస్‌ పక్కన ఉన్న పోకాల కుంట కబ్జాపై అధికారులు దృష్టి సారించారు. గురువారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి రెవెన్యూ, నీటి పారుదలశాఖ అధికారులు శుక్రవారం జాయింట్‌ సర్వే నిర్వహించారు.

కుంట కబ్జాపై అధికారుల దృష్టి

ఎల్లారెడ్డి, అక్టోబరు 29: పట్టణంలోని సాతెల్లి బేస్‌ పక్కన ఉన్న పోకాల కుంట కబ్జాపై అధికారులు దృష్టి సారించారు. గురువారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి రెవెన్యూ, నీటి పారుదలశాఖ అధికారులు శుక్రవారం జాయింట్‌ సర్వే నిర్వహించారు. ఈ సందర్భం గా అధికారులు మాట్లాడుతూ వెంచర్ల పేరుతో ప్రభుత్వ భూములను, నీటి కుంటలను ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పబోవని తెలిపారు. పోకాల కుటంలో సర్వేనంబర్‌ 1292లో 3.10 గుంటల శిఖం భూమిని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కబ్జా చేయడంపై విచారణ చేపట్టినట్లు వివరించారు. సర్వే వివరాలు వచ్చిన తర్వాత కబ్జాచేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఈఈ వెంకటేశ్వర్లు, ఎంఆర్‌వో తెలిపారు. ఈ సర్వేలో సర్వేయర్‌ అభిలాష్‌, నీటిపారుదల ఏఈ శ్రీకాంత్‌, వర్క్‌ ఇన్స్‌స్పెక్టర్‌ రషీద్‌లు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-30T05:20:52+05:30 IST