ఉపాధిహామీ పనుల పరిశీలన

ABN , First Publish Date - 2021-05-02T06:18:59+05:30 IST

మండలంలోని పెద్దకొడప్‌గల్‌, కాస్లాబాద్‌ గ్రామంలో శనివారం ఉపాధి హామీ పనులను ఎంపీడీవో సుధాకర్‌రెడ్డి పరిశీలించారు.

ఉపాధిహామీ పనుల పరిశీలన
కాస్లాబాద్‌లో పనులను పరిశీలిస్తున్న అధికారులు

పెద్ద కొడప్‌గల్‌, మే 1: మండలంలోని పెద్దకొడప్‌గల్‌, కాస్లాబాద్‌ గ్రామంలో శనివారం ఉపాధి హామీ పనులను ఎంపీడీవో సుధాకర్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తప్పక మాస్కులు ధరించాలన్నారు. అలాగే భౌతిక దూరం పాటిస్తూ కొలతల ప్రకారం పనులు చేయాలన్నారు. ఉపాధిహామీ పనులు జరిగే చోట కూలీలకు కావాల్సిన వసతు లను కల్పించాలని స్థానిక సిబ్బందికి ఎంపీడీవో సూచించారు. ఆయన వెంట ఆయా గ్రామాల సర్పంచులు, కార్యదర్శులు, తదితరులున్నారు.  
గాంధారిలో..
గాంధారి: మండల కేంద్రంలో చేపడుతున్న ఉపాధిహామీ పనులను శనివారం ఎంపీడీవో సతీష్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పనులపై కూలీలకు పలు సూచనలు చేశారు. ప్రతీ ఒక్కరికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని సిబ్బందికి సూచించారు.

Updated Date - 2021-05-02T06:18:59+05:30 IST