నర్సరీ పనులను వేగవంతం చేయాలి

ABN , First Publish Date - 2021-11-03T05:11:25+05:30 IST

ప్రతీ గ్రామంలో నర్సరీల ఏర్పాటుకు ప్రణాళికను తయారు చేసి పనులను వేగవంతం చేయాలని అసిస్టెం ట్‌ కలెక్టర్‌ వెంకటేష్‌దోత్రే అన్నారు.

నర్సరీ పనులను వేగవంతం చేయాలి

అసిస్టెంట్‌ కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే
దోమకొండ, నవంబరు 2: ప్రతీ గ్రామంలో నర్సరీల ఏర్పాటుకు ప్రణాళికను తయారు చేసి పనులను వేగవంతం చేయాలని అసిస్టెం ట్‌ కలెక్టర్‌ వెంకటేష్‌దోత్రే అన్నారు. మంగళవారం ఆయన దోమకొండ మండల పరిషత్‌ కార్యాలయంలో బీబీపేట, భిక్కనూర్‌, రాజంపేట, దోమకొండ మండలాల ఎంపీడీవోలు, ఏపీవోలు, ఎంపీవోలతో సమా వేశం నిర్వహించారు. నర్సరీ పనులను వేగవంతం చేయాలని సూచి ంచారు. అన్ని గ్రామాల్లో ఉపాధిహామీ కూలీల సంఖ్యను పెంచాల న్నారు. వంద శాతం ఇంటి పన్నులను వసూలు చేయాలని ఆదేశిం చారు. అవెన్యూ ప్లాంటేషన్‌ పనులు పూర్తి చేసి మొక్కల వద్ద పిచ్చి మొక్కలు లేకుండా కూలీలతో పనులు చేయించాలన్నారు. కార్యక్ర మంలో సీఈవో సాయాగౌడ్‌, పీడీ శ్రీకాంత్‌, డీపీవో సాయిబాబా, ఎంపీడీవోలు చిన్నారెడ్డి, నారాయణ, అనంత్‌రావు, బాలకిషన్‌, ఏపీవో లు రజని, అన్నపూర్ణ, ఎంపీవోలు తిరుపతిరెడ్డి, లక్ష్మీనర్సయ్య, యుగేందర్‌, శ్రీకాంత్‌, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-03T05:11:25+05:30 IST