విద్యార్థుల భవిష్యత్తు కంటే ఏదీ ముఖ్యం కాదు

ABN , First Publish Date - 2021-09-03T05:50:44+05:30 IST

విద్యార్థుల భవిష్యత్తు కంటే ఏదీ ముఖ్యం కాదని, ఉపాధ్యాయులు ఆ దిశగానే ముందుకు వెళ్లాలని కలెక్టర్‌ నారా యణరెడ్డి సూచించారు. గురువారం ఎడపల్లి మండలంలోని జానకంపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.

విద్యార్థుల భవిష్యత్తు కంటే ఏదీ ముఖ్యం కాదు
అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ నారాయణరెడ్డి

కలెక్టర్‌ నారాయణరెడ్డి 

ఎడపల్లి, సెప్టెంబరు 2: విద్యార్థుల భవిష్యత్తు కంటే ఏదీ ముఖ్యం కాదని, ఉపాధ్యాయులు ఆ దిశగానే ముందుకు వెళ్లాలని కలెక్టర్‌ నారా యణరెడ్డి సూచించారు. గురువారం ఎడపల్లి మండలంలోని జానకంపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. డిజిటల్‌ తరగతుల ద్వారా ఏం నేర్చుకున్నారని విద్యార్థులను ఆరా తీశారు. టీచర్లతో మాట్లాడుతూ.. ఫిజికల్‌ క్లాసులు స్టార్ట్‌ అయినందున ఇన్ని రోజుల పాటు ఏదైతే పిల్లలు నష్టపోయారో దాన్ని తిరిగి పొందే విధంగా బోధించాల్సిన అవసరం ఉం దన్నారు. బేసిక్స్‌ చెప్పాలన్నారు. ప్రతీ టీచర్‌ సిస్టమే టిక్‌గా నెల రోజుల కోసం ప్లాన్‌ చేసుకోవాలని ప్లాన్‌ ఏ, ప్లాన్‌ బీ ప్రకారం వెళ్లాలన్నారు. కొవిడ్‌ కారణంగా సంవత్సరంన్నర కాలం తర్వాత సూళ్లు ఓపెన్‌ అయినవి కాబట్టి బేసిక్స్‌ ప్రతి సబ్జె క్టులో రిపీట్‌ చేయాలన్నా రు. ఒక నెలలో గట్టిగా పనిచేసి విద్యార్థుల ను తిరిగి పాఠశాల వాతావరణానికి తీసుకు రావా లన్నారు. స్కూళ్లలో ఏ సమస్య ఉన్నా శనివారం వరకు పూర్తి చేయాలని సర్పంచ్‌, ఎంపీడీవోను ఆదేశించారు. అంగన్‌వాడీ సెంటర్‌ను పరిశీలించి పిల్లలను దూరం దూరం కూర్చోబెట్టాలని తెలిపారు. గ్రామంలో దోమల నివారణకు స్ర్పే చేయాలని, బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లాలని ఫాగింగ్‌ చేయించాలన్నారు. స్కూల్‌ ఆవరణలో మొక్కలు నాటాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ ప్రవీణ్‌ కుమార్‌, ఎంపీడీవో శంకర్‌, ఎంపీవో శ్రీనివాస్‌, సర్పంచ్‌ సాయిలు, ఎంఈవో రామారావు, ఇన్‌చార్జి హెచ్‌ఎం అరుణ, ఎస్‌ఎంసీ చైర్మన్‌ పోశెట్టి, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-09-03T05:50:44+05:30 IST