ఆగని అక్రమం

ABN , First Publish Date - 2021-10-20T05:18:55+05:30 IST

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా పరిధిలో గంజాయి అక్రమ రవాణా ఆగడం లేదు. అటవీ ప్రాంతంలో అక్కడక్కడ గంజాయిని సాగుచేస్తుండగా.. ఇతర ప్రాంతాల నుంచి ఉమ్మ డి జిల్లా మీదుగా రవాణా చేస్తున్నారు.

ఆగని అక్రమం
కామారెడ్డి జిల్లాలోని సదాశివనగర్‌ మండలంలో పత్తి పంటలో గంజాయిని అంతర పంటగా సాగుచేస్తున్న దృశ్యం

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా పరిధిలో యథేచ్ఛగా సాగుతున్న గంజాయి రవాణా

పలుచోట్ల అంతరపంటగా సాగు

జిల్లా మీదుగా మహారాష్ట్రకు తరలింపు

ఉమ్మడి జిల్లాలోనూ విక్రయాలు

ఎక్కువగా కొనుగోలు చేస్తున్న యువత

సాగుపై ఎక్సైజ్‌, పోలీసు శాఖల నిఘా

అటవీ ప్రాంతాలు, పంట పొలాల్లో తనిఖీలు

మొక్కలను ధ్వంసం చేసి బాధ్యులపై కేసులు నమోదు చేస్తున్న పోలీసులు 

నిజామాబాద్‌, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా పరిధిలో గంజాయి అక్రమ రవాణా ఆగడం లేదు. అటవీ ప్రాంతంలో అక్కడక్కడ గంజాయిని సాగుచేస్తుండగా.. ఇతర ప్రాంతాల నుంచి ఉమ్మ డి జిల్లా మీదుగా రవాణా చేస్తున్నారు. గతంకంటే భిన్నంగా సరిహద్దులు దాటిస్తున్నారు. రైలు, రోడ్డు మార్గం అం దుబాటులో ఉండడంతో విశాఖ ఏజెన్సీతో పాటు ఇతర ప్రాంతాల నుంచి గంజాయి రవాణా కొనసాగుతోంది. కొద్ది మొత్తంలో ఉమ్మడి జిల్లా పరిధిలో విక్రయిస్తుండగా మిగతా గంజాయిని మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు తరలిస్తున్నారు. గతంలో ఉమ్మడి జిల్లా పరిధిలో గంజాయిని నిల్వ ఉంచి సరఫరా చేయగా.. ప్రస్తుతం నిఘా పెరగడంతో తరలింపు వరకే సహకరిస్తున్నారు. గతంలో గంజాయి సరఫరాలో ఉన్నా.. ఎక్కువమంది కేసులకు భయపడి దూరం గా ఉండగా.. మిగతా వారిపైన ఎక్సైజ్‌, పోలీసు యంత్రాంగం నజర్‌ పెట్టింది. సరిహద్దులతో పాటు అటవీ ప్రాంతా ల్లో తనిఖీలు చేస్తూ పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

అంతర పంటగా సాగు

ఉమ్మడి జిల్లా పరిధిలోని అటవీ ప్రాంతంలో రెండేళ్ల క్రి తం వరకు కొన్ని తండాల పరిధిలో గంజాయి సాగు కొనసాగింది. పోలీసులు, ఎక్సైజ్‌ అధికారుల దాడులతో పాటు నార్కోటిక్స్‌ అధికారులు కూడా దృష్టిపెట్టడంతో కొద్ది మొత్త ంలో సాగు తగ్గింది. ఉమ్మడి జిల్లా పరిధిలోని కొన్ని అటవీ ప్రాంతాల్లో అక్కడక్కడ పత్తి, ఇతర పంటలలో కొద్ది మొత్త ంలో సాగు కొనసాగిస్తున్నారు. ఈ మధ్యనే సదాశివనగర్‌, బిచ్కుంద, మద్నూర్‌, గాంధారి, ఎల్లారెడ్డి, ఆర్మూర్‌ డివిజన్‌ పరిధిలోని మెండోరా, కమ్మర్‌పల్లి, వేల్పూర్‌ క్రాస్‌ రోడ్స్‌తో పాటు పలు ప్రాంతాల్లో గంజాయిని పట్టుకున్నారు. సదాశివనగర్‌ మండలం యాచారం పరిధిలో సాగుచేస్తున్న గం జాయి మొక్కలను తొలగించడంతో పాటు సాగు చేసిన వారిపై కేసులు నమోదు చేశారు. ఉమ్మడి జి ల్లా పరిధిలో గత పదేళ్లుగా గంజాయి రవా ణా కొనసాగుతోంది. జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి మహారాష్ట్రకు సరఫరా అవుతోంది. ఖమ్మం, విశాఖపట్టణం ఏజెన్సీల నుంచి గతంలో గంజాయి సరఫరా కా గా.. నిజామాబాద్‌ నగరంతో పాటు గాంధారి, ఇతర ప్రాం తాల్లో నిల్వ ఉంచి మహారాష్ట్రకు సరఫరా చేశారు. ఇతర జి ల్లాల నుంచి ఎక్కువగా ఉమ్మడి జిల్లాకు రవాణా చేసి మ హారాష్ట్రకు తరలించేవారు. రెండేళ్ల క్రితం దాడులు చేసి ప లువురిపై కేసులు నమోదు చేయడంతో పాటు నిఘా పెట్టడంతో కొంతమేర తగ్గింది. 

యువతే లక్ష్యంగా విక్రయాలు

ఉమ్మడి జిల్లా పరిధిలో గంజాయి వాడకం పెరిగింది.  చి న్నచిన్న పొట్లాల ద్వారా గంజాయిని ఎక్కువ గా సరఫరా చే స్తున్నారు. తక్కువ డబ్బులతో ఎక్కువ మొత్తంలో మత్తుకు అల వాటు పడిన యువకులు ఈ గంజాయిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో యువతే టార్గెట్‌గా గంజాయి విక్రయాలు కొనసాగుతున్నాయి. కొన్నిచోట్ల పోలీసులు, మరికొన్నిచోట్ల ఎక్సైజ్‌ అధికారులు పట్టుకొని కేసులు నమోదు చేసినా రవాణా ఆగ డం లేదు. గ్రామాల్లో చిన్న చిన్న దుకాణాల ద్వారా కూడా ఈ గంజాయిని తెలిసిన 

వారికి విక్రయిస్తున్నారు. ఆర్మూర్‌ డివిజన్‌ పరిధిలో గంజాయి మత్తులో రెండు హత్యలు జరిగిన తర్వాత ఆ యా పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో నజర్‌ పెంచి పలుచోట్ల గం జాయిని పట్టుకున్న తర్వాత ఒత్తిళ్లతో దాడులు తగ్గించారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఇప్పటికీ పలుచోట్ల రైల్వేస్టేషన్‌ లు, బస్టాండ్‌లు, ఇతర ప్రాంతాల్లో గంజాయి అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో గంజాయి సా గు తగ్గినా అమ్మకాలు మాత్రం కొనసాగుతున్నాయి.

తనిఖీలు చేపడుతున్న అధికారులు

ప్రభుత్వం గంజాయి అక్రమ రవాణాపై దృష్టిపెట్టడంతో ఉమ్మడి జిల్లా పరిధిలో అధికారులు గడిచిన కొన్నిరోజులు గా తనిఖీలు కొనసాగిస్తున్నారు. అటవీ ప్రాంతంలో ఇన్ఫా ర్మర్‌ వ్యవస్థ ద్వారా సాగును తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మద్నూర్‌, సాలూరా చెక్‌పోస్టుల పరిధిలో గట్టి ని ఘా పెట్టారు. ఇతర సరిహద్దుల్లో కూడా వాహనాలు తనిఖి చేస్తున్నారు. గతంలో గంజాయి సరఫరా చేసిన వారిపై న కూడా నిఘా పెట్టారు. ఇతర జిల్లాల నుంచి ఏయే ప్రా ంతాలకు ఈ గంజాయి రవాణా అవుతుందో ఆరా తీస్తున్నా రు. వారిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఉమ్మడి జి ్లా పరిధిలో గడిచిన నెల రోజుల్లో గంజాయిపైన నాలుగు కేసులు నమోదు చేశారు. ఎక్సైజ్‌, పోలీస్‌ శాఖల్లోని టాస్క్‌ఫోర్స్‌ వింగ్‌ అధికారులు ఈ దాడులను కొనసాగిస్తున్నారు. వరుస దాడులతో ఉమ్మడి జిల్లా పరిధిలో గంజాయి సాగు తగ్గిపోయిందని ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌ ఏఈఎస్‌ నందగోపాల్‌ తెలిపారు. అక్కడక్కడ మొక్కలు పెట్టిన సమాచారం మేర కు వాటిని తొలగించి సాగు చేసిన వారిపై కేసులు పెడుతున్నామన్నారు. గతంలో సాగు చేసి, రవాణా చేసినవారిపైన కూడా నిఘా పెట్టామని ఆయన తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి జిల్లా మీదుగా మహారాష్ట్రకు వెళ్లే రవాణాపైన కూడా దృష్టిపెట్టామని, నిరంతర తనిఖీలు కొనసాగిస్తున్నామని ఆయన తెలిపారు. 

Updated Date - 2021-10-20T05:18:55+05:30 IST