శానిటేషన్‌ ఇన్నోవేషన్‌ అవార్డుకు కలెక్టర్‌ ఎంపిక

ABN , First Publish Date - 2021-03-21T05:54:56+05:30 IST

రెండో ఎలెట్స్‌ నేషనల్‌ వా టర్‌, శానిటేషన్‌ ఇన్నోవేషన్‌ అవార్డు 2021కు కలెక్టర్‌ శరత్‌ ఎంపికయ్యారు.

శానిటేషన్‌ ఇన్నోవేషన్‌ అవార్డుకు కలెక్టర్‌ ఎంపిక

కామారెడ్డి, మార్చి 20: రెండో ఎలెట్స్‌ నేషనల్‌ వా టర్‌, శానిటేషన్‌ ఇన్నోవేషన్‌ అవార్డు 2021కు కలెక్టర్‌ శరత్‌ ఎంపికయ్యారు. కేంద్ర జలశక్తి, భారత ప్రభు త్వ నేషనల్‌ మిషన్‌ క్లీన్‌గంగా సమన్వయంతో ఎలె ట్స్‌ స్వచ్ఛంద సంస్థ ఈ నెల 18న నిర్వహించిన ఇ న్నోవేషన్‌ సమ్మిట్‌లో అవార్డు ప్రకటించారు. రాష్ట్ర ప్ర భుత్వం చేపట్టిన నీటి సంరక్షణ చర్యలు, జాతీయ ఉపాధిహామీ పనులు, చెక్‌డ్యాముల నిర్మాణం, మిష న్‌ కాకతీయ కార్యక్రమాలు జిల్లాలో అమలు చేయ డంతో భూగర్భ జలాల పురోగతితో ఇన్నోవేషన్‌ ఇన్‌ రెయిన్‌ వాటర్‌, వాటర్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ రెండు విభాగాలలో అవార్డు లభించింది. ఎలెట్స్‌ అవార్డు జి ల్లాకు రావడంపై  కలెక్టర్‌ సంబంధిత విభాగాల అధికారులను అభినందించారు.

Updated Date - 2021-03-21T05:54:56+05:30 IST