మందులు, ఇంజక్షన్‌ల కొరత లేదు : మంత్రి
ABN , First Publish Date - 2021-05-21T04:28:59+05:30 IST
జిల్లాలో వైరస్ వ్యాప్తి త గ్గుతుందని, ఆసుపత్రులలో బెడ్స్, ఆక్సిజన్, రెమ్‌డెసివిర్ ఇంజక్షన్‌ల కొరత లేదని రాష్ట్ర శాసనసభ, రోడ్లు భవనాలు గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. గురువారం ప్రగతిభవన్‌లో కొవిడ్‌పై వైద్యశాఖ అధికారు లు, ఆసుపత్రుల సూపరిండెంట్‌లు, ఆర్డీవోలు, పోలీసు ఉ న్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో కరోనా తీవ్రత క్రమక్రమంగా తగ్గుతుందని, పాజిటివ్ కేసులు 25 శాతం నుం చి 10 శాతానికి తగ్గిపోయాయని, దీని కోసం కృషి చేస్తున్న ప్రతీఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని లాక్‌డౌన్ సడలింపు వేళల్లో మార్కెట్‌లో రద్దీని తగ్గించడానికి తాత్కాలిక మార్కెట్‌లు ఏర్పాటు చేయాలని తెలిపారు.

నిజామాబాద్‌అర్బన్, మే 20: జిల్లాలో వైరస్ వ్యాప్తి త గ్గుతుందని, ఆసుపత్రులలో బెడ్స్, ఆక్సిజన్, రెమ్‌డెసివిర్ ఇంజక్షన్‌ల కొరత లేదని రాష్ట్ర శాసనసభ, రోడ్లు భవనాలు గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. గురువారం ప్రగతిభవన్‌లో కొవిడ్‌పై వైద్యశాఖ అధికారు లు, ఆసుపత్రుల సూపరిండెంట్‌లు, ఆర్డీవోలు, పోలీసు ఉ న్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో కరోనా తీవ్రత క్రమక్రమంగా తగ్గుతుందని, పాజిటివ్ కేసులు 25 శాతం నుం చి 10 శాతానికి తగ్గిపోయాయని, దీని కోసం కృషి చేస్తున్న ప్రతీఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని లాక్‌డౌన్ సడలింపు వేళల్లో మార్కెట్‌లో రద్దీని తగ్గించడానికి తాత్కాలిక మార్కెట్‌లు ఏర్పాటు చేయాలని తెలిపారు. రెస్టారెంట్లు, హోటళ్లల్లో సీట్ల సామర్థ్యాన్ని 50 శాతానికి తగ్గించుకోవాలని, టిఫిన్ సెంటర్‌ల్లో పార్సిల్స్ మాత్రమే కొనసాగించాలని అన్నారు. వైరస్ తీవ్రంగా ఉన్న సమయంలో వందమందికి టెస్టులు చేయగా 25 మందికి పాజిటివ్ వచ్చింద ని గత సమీక్ష సందర్భంగా 15 శాతానికి తగ్గిందని, ప్రస్తు తం 10 శాతానికి కేసుల సంఖ్య తగ్గిందన్నారు. ఇంజక్షన్‌లు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పదివేలు, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 4600 అందుబాటులో ఉన్నాయన్నారు. బ్లాక్ ఫంగస్ వ్యాధికి సంబంధించి మందుల కొరతతో ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో లేదా కోఠిలోని ఈఎన్‌టీ ఆసుపత్రులకు రోగులను పంపించాలని త్వరలోనే మందులు రాగానే ఇక్కడ కూడా చికిత్సకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు బ్లాక్ ఫంగస్ మందుల కోసం ప్రభుత్వం జారీచేసిన ప్రొఫార్మ ప్రకారం దరఖాస్తులు చేయాలని సూచించారు. ప్రస్తుతం టీకా సరఫరా లేనందున కేంద్ర ప్రభుత్వ అనుమతితో గ్లోబల్ టెండర్‌ల ద్వారా కొనుగోలుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యే బిగాలగణేష్ గప్తా, కలెక్టర్ నారాయణరెడ్డి, సీపీ కార్తీకేయ తదితరులు పాల్గొన్నారు.