టీయూలో ఎలాంటి ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు

ABN , First Publish Date - 2021-10-19T05:56:24+05:30 IST

తెలంగాణ యూనివర్సిటీ లో ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో ఇప్పటి వరకు ఎలాంటి ఉద్యోగ నియామకాలు చేపట్టలేదని వర్సిటీ వైస్‌ ఛా న్స్‌లర్‌ రవీందర్‌ గుప్తా తెలిపారు. సోమవారం విశ్వ విద్యాలయంలో రిజిస్ర్టార్‌ కనకయ్యతో కలిసి వీసీ వి లేకరులతో మాట్లాడారు.

టీయూలో ఎలాంటి ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు
విలేకరులతో మాట్లాడుతున్న వీసీ

కొందరు అధ్యాపకులు కావాలనే వర్సిటీ ప్రతిష్ఠను భంగపరుస్తున్నారు 

టీయూ వీసీ ప్రొఫెసర్‌ రవీందర్‌ గుప్తా

డిచ్‌పల్లి, అక్టోబరు 18: తెలంగాణ యూనివర్సిటీ లో ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో ఇప్పటి వరకు ఎలాంటి ఉద్యోగ నియామకాలు చేపట్టలేదని వర్సిటీ వైస్‌ ఛా న్స్‌లర్‌ రవీందర్‌ గుప్తా తెలిపారు. సోమవారం విశ్వ విద్యాలయంలో రిజిస్ర్టార్‌ కనకయ్యతో కలిసి వీసీ వి లేకరులతో మాట్లాడారు. వర్సిటీకి దళితుడు రిజిస్ట్రార్‌ అయిన కారణంగానే గిట్టని కొందరు ప్రొఫెసర్లు వి ద్యార్థి సంఘ నాయకులతో కలిసి తప్పుడు ఆరోపణ లు చేస్తున్నారని వీసీ పేర్కొన్నారు. రిజిస్ట్రార్‌  పదవిని ఆశించి భంగపడ్డ కొందరు ప్రొఫెసర్లు విద్యార్థి సంఘ నాయకులను రెచ్చగొడుతూ తనతో పాటు రిజిస్ట్రార్‌ పై తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారని, సామాజిక మాధ్యమాల ద్వారా అబద్ధపు ప్రచారం చేయిస్తున్నార ని, ఇది సబబు కాదన్నారు. ఈ ఆరోపణలు చేస్తున్న వారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. వర్సిటీలో ఫేక్‌ సర్టిఫికెట్లతో ప్రొఫెసర్‌ లుగా చలామణి అవుతున్న వారి వివరాలు సేకరిస్తు న్నమని వారిపై తప్పక చర్యలు తీసుకుంటమన్నారు. ప్రస్తుతం రిజిస్ట్రార్‌గా కొనసాగుతున్న కనకయ్యను తొ లగిస్తే ఎలాంటి గొడవలు ఉండవని కొందరు బహిర ంగంగా తనతో పేర్కొంటున్నారని వీసీ తెలిపారు. వ ర్సిటీ పరిధిలో ఈసీ నిర్ణయం మేరకే ఉద్యోగాల భర్తీ చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కొత్త గా మరో 300 మందిని ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో ఈసీ అనుమతులు తీసుకున్న తర్వాత నియామకాలు చే స్తామని, ఈ విషయాన్ని ఇదివరకే ఉన్నత విద్యామం డలి ఉన్నతాధికారులు నవీన్‌ మిట్టల్‌, సందీప్‌ సుల్తానీ యాలకు తెలియజేశామని తెలిపారు. వర్సిటీలో ఖాళీ ల వివరాలు కూడా పంపడం జరిగిందన్నారు. వర్సిటీ పరిధిలో సారంగపూర్‌, సౌత్‌ క్యాంపస్‌, మెయిన్‌ క్యాం పస్‌ పరిధిలో 30 డిపార్టుమెంట్లు ఉన్న కారణంగా సి బ్బంది నియామకం తప్పనిసరి అన్నారు. నియామకా లు పూర్తిగా పారదర్శకంగా చేపట్టడం జరుగుతుంద ని, ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీ ద్వారానే నియామకాలు జ రుగుతాయన్నారు. ప్రశాంతంగా ఉన్న టీయూని వి ధ్వంసకర వర్సిటీగా మార్చుతున్నారని, విద్యార్థి సం ఘాల ద్వారా ఆందోళనలు చేయిస్తున్న అధ్యాపకుల ను గుర్తించడం జరిగిందని, వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేయడం జరుగుతుందన్నారు. 

Updated Date - 2021-10-19T05:56:24+05:30 IST