Nizamabad: ఇండియన్ పెట్రోల్ బంక్‌లో దొంగల బీభత్సం
ABN , First Publish Date - 2021-12-30T13:41:37+05:30 IST
జిల్లాలోని ధర్పల్లి మండల కేంద్రంలో గల ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌లో దొంగల బీభత్సం సృష్టించారు.

నిజామాబాద్: జిల్లాలోని ధర్పల్లి మండల కేంద్రంలో గల ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌లో దొంగల బీభత్సం సృష్టించారు. పది మందికి పైగా ముఠాగా వచ్చి పెట్రోల్ బంక్‌పై రాళ్లతో దాడి చేశారు. ఆపై క్యాష్ కౌంటర్‌ను ఎత్తుకెళ్లారు. అందులో దాదాపు రూ.40వేల నగదు ఉన్నట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన వెంటనే నిజామాబాద్ సీపీ నాగరాజు, ఏసీపీ వెంకటేశ్వర్లు, సీఐ శ్రీశైలం సంఘటన స్థలానికి చేరుకుని అక్కడ పరిస్థితిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.