Nizamabad: ఇసుక మాఫియా దాడిలో వీఆర్ఏ మృతి
ABN , First Publish Date - 2021-12-07T17:49:34+05:30 IST
జిల్లాలోని బోధన్ మండలం కండ్గావ్ గ్రామంలో దారుణం జరిగింది. గత రాత్రి అక్రమ ఇసుక రవాణాను వీఆర్ఏ గౌతమ్ అడ్డుకున్నారు.
నిజామాబాద్: జిల్లాలోని బోధన్ మండలం కండ్గావ్ గ్రామంలో దారుణం జరిగింది. గత రాత్రి అక్రమ ఇసుక రవాణాను వీఆర్ఏ గౌతమ్ అడ్డుకున్నారు. దీంతో రెచ్చి పోయిన ఇసుక మాఫియా... వీఆర్ఏపై దాడి చేసింది. దీంతో వీఆర్ఏ తీవ్రంగా గాయపడటంతో వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ వీఆర్ఏ మృతి చెందాడు. ఈ ఘటనపై వీఆర్ఏ సంఘాలు, కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీస్స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు.