కళావిహీనంగా నిజాంసాగర్‌ అతిథి గృహం

ABN , First Publish Date - 2021-01-12T06:14:40+05:30 IST

ఉమ్మడి జిల్లాలోనే ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్న నిజాంసాగర్‌ వీఐపీ అతిథి గృహం కనీస సౌకర్యాల కు నోచుకోవడం లేదు. ఈ గృహానికి ఎందరో ప్రజాప్రతినిధులు, వీఐపీ అధికారులు వస్తున్నా కనీస సౌకర్యాలు కల్పించాలనే ఆలోచన లేక పోవడం గమనార్హం.

కళావిహీనంగా నిజాంసాగర్‌ అతిథి గృహం
పురాతన అతిథి గృహం

ఉభయ జిల్లాలోనే ప్రాముఖ్యత గాంచిన నిజాంసాగర్‌ అతిథి గృహం

కనీస సౌకర్యాలు కల్పించని అధికార యంత్రాంగం

నిజాంసాగర్‌, జనవరి 11: ఉమ్మడి జిల్లాలోనే ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్న నిజాంసాగర్‌ వీఐపీ అతిథి గృహం కనీస సౌకర్యాల కు నోచుకోవడం లేదు. ఈ గృహానికి ఎందరో ప్రజాప్రతినిధులు, వీఐపీ అధికారులు వస్తున్నా కనీస సౌకర్యాలు కల్పించాలనే ఆలోచన లేక పోవడం గమనార్హం. 

నైజాం ప్రభుత్వ హయాంలో.. 

నైజాం ప్రభుత్వ హయాంలో నిజాంసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణానికి ముందే పరిసర ప్రాంతాల్లో దాదాపు మూడెకరాల స్థలంలో వీఐపీ అ తిథి గృహంతో పాటు ఆహ్లాదకరంగా ఉండేందుకు గార్డెన్ల నిర్మాణం చే పట్టారు. కాలక్రమేణా నీటి పారుదల శాఖ అధికార యంత్రాంగం నిర్ల క్ష్య వైఖరి కారణంగా అతిథి గృహాలు కళాహీనంగా మారాయి. ఆనాడు నైజాం ప్రభుత్వం ఎంతో సుందరంగా నిర్మించిన అతిథి గృహంలో అ న్ని వసతులు కల్పించారు. ఉమ్మడి జిల్లాలకే కాకుండా రాష్ట్ర రాజధా నికి కూడా ఈ అతిథి గృహానికి ఎంతో పేరుంది. ఈ అతిథి గృహంలో నే దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి రెండు పర్యాయాలు పుట్టిన రోజు జరుపుకోవడం అతిథి గృహాల విశిష్టత. 

1996లో నక్సల్స్‌ పేల్చివేత.. 

1996లో అతిథి గృహాన్ని నక్సల్స్‌ పేల్చి వేయడంతో ఆనాటి సగ భాగం అతిథి గృహం పేల్చి వేతకు కూలిపోయింది. నీటి పారుదల శా ఖాధికారులు సగభాగం అతిథి గృహాన్ని పూర్తిస్థాయిన కూల్చివేశారు. 1999లో రూ.19 లక్షలతో పురాతన అతిథి గృహం పక్కనే మరో అతిథి గృహాన్ని నిర్మాణం చేపట్టారు. అతిథి గృహంలో రెండు సూట్లను నిర్మా ణం చేసి ఫర్నిచర్‌తో పాటు కనీస సౌకర్యాలు ఉండేలా కల్పించారు. ప క్కనే ఉన్న పురాతన అతిథి గృహానికి 2013లో కాంగ్రెస్‌ ప్రభుత్వ హ యాంలో 48 లక్షల రూపాయల వ్యయంతో అప్పటి అతిథి గృహంపై కప్పును తొలగించి, స్లాబ్‌ను వేసి మరమ్మతులు చేశారు. ఈ అతిథి గృహంలో కనీస వసతులతో పాటు ఫర్నిచర్‌ లేకపోవడంతో నిరు పయోగంగా దర్శనమిస్తూనే ఉంది. 

ప్రస్తుతం కళావిహీనంగా

ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నప్పటికీ నైజాం కాలం నాటి అతిథి గృహానికి పూర్వ వైభవం తేవాలన్న ఆలోచన లేకుండా పోయిం ది. ఈ అతిథి గృహం ఆవరణలో ఉన్న గార్డెన్లు, సిబ్బంది లేని కారణం గా కళావిహీనంగా మారాయి. ప్రధాన రహదారికి అడ్డంగా చెట్టు కూ లిపోయినా వాటిని తొలగించాలనే కనీస ఆలోచన నీటి పారుదల శాఖ అధికారులకు లేకపోవడం గమనార్హం. పాలకులు, అధికారులు స్పం దించి కనీస వసతులు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Updated Date - 2021-01-12T06:14:40+05:30 IST