హరితహారానికి సిద్ధం కావాలి

ABN , First Publish Date - 2021-06-23T04:41:58+05:30 IST

త్వరలో చేపట్టనున్న హరితహారం కార్యక్రమానికి పంచాయతీ కార్యదర్శులు సిద్ధం కావాలని డీఎల్‌పీవో నాగరాజు సూచించారు. మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీవో మధురిమ అధ్యక్షతన పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆదేశాల మేరకు పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

హరితహారానికి సిద్ధం కావాలి
మినార్‌పల్లిలో అధికారులతో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్చ్‌

నిజామాబాద్‌ రూరల్‌, జూన్‌ 22: త్వరలో చేపట్టనున్న హరితహారం కార్యక్రమానికి పంచాయతీ కార్యదర్శులు సిద్ధం కావాలని డీఎల్‌పీవో నాగరాజు సూచించారు. మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీవో మధురిమ అధ్యక్షతన పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆదేశాల మేరకు పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో జరుగుతున్న పనులు కలెక్టర్‌ పరిశీలిస్తున్నారని, ప్రతీ ఒక్కరు జాగ్రత్తతో ఉండాలన్నారు. గ్రామాల్లోని నర్సరీల్లో మొక్కలు సిద్ధ చేయాలని, మొక్కలు నాటే ప్రదేశాలను గుర్తించాలని, వాటి వివరాలు గ్రామపెద్దలతో కలిసి చర్చించాలని సూచించారు. పారిశుధ్య పనులు నూటికి నూరుశాతం పూర్తిచేయాలని అన్నారు. అవెన్యూ ప్లాంటేషన్‌కు సరిపడా మొక్కలు లేకపోతే అవి దొరికేచోట నుంచి తీసుకురావాలని, హరితహారం కార్యక్రమం చేపట్టే సమయానికివాటిని సిద్ధం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో డీఎల్‌పీవో నాగరాజు, ఎంపీవో మధురిమ, ఏపీవో పద్మ, ఏపీవో పద్మ పాల్గొన్నారు.
హసాకొత్తూర్‌లో అవెన్యూ ప్లాంటేషన్‌ పనుల పరిశీలన
కమ్మర్‌పల్లి: హసాకొత్తూర్‌ చౌట్‌పల్లి గ్రామాల సరిహద్దులో ఆర్‌అండ్‌బీ రహదారికి ఇరువైపులా ఏర్పాటు చేస్తున్న అవెన్యూ ప్లాంటేషన్‌ పనులను మంగళవారం డివిజినల్‌ పంచాయతీ అధికారి శ్రీనివాస్‌ కుమార్‌ పరిశీలిం చారు. ఆర్‌అండ్‌బీ సరిహద్దుల్లో రహదారికి మధ్యలో నుంచి 29 అడుగుల దూరంలో గల వ్యవసాయ భూముల్లో నాటే మొక్కలను సంరక్షించాలని, లేనిపక్షంలో చర్యలు ఉంటాయని అన్నారు. తవ్విన గుంతల కొలతలను చూశారు. ఎంపీడీవో సంతోష్‌ రెడ్డి, ఎంపీవో శ్రీనివాస్‌గౌడ్‌, సర్పంచ్‌  మా రు శంకర్‌, హసాకొత్తూర్‌ ఉప సర్పంచ్‌ ఏనుగు రాజేశ్వర్‌  పాల్గొన్నారు.
మినార్‌పల్లి గ్రామాన్ని సందర్శించిన అదనపు కలెక్టర్‌
బోధన్‌: మినార్‌పల్లి గ్రామంలో మంగళవారం అదనపు కలెక్టర్‌ లత పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పరిసరాలను పర్యవేక్షించారు. హరితహారం కార్యక్రమం వివరాలు అడిగి తెలుసుకున్నారు. పథకాలు, హ రితహారం, పల్లెప్రగతిని విజయవం తం చేయాలన్నారు. బోధన్‌ ఎంపీడీవో సుదర్శన్‌, ఎంపీవో మధుకర్‌, గ్రామ సర్పంచ్‌ తదితరులున్నారు.
మెగా నర్సరీ కోసం స్థల పరిశీలన
భీమ్‌గల్‌: భీమ్‌గల్‌ పట్టణ శివారులో మెగా నర్సరీతో పాటు ప్రకృతి వ నం ఏర్పాటు కోసం మంగళవారం ఆయా శాఖల అధికారులు స్థల పరిశీల న చేశారు. రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి ఆదేశాలు, కలెక్టర్‌ సూచన మేరకు పట్టణ శివారులో మెగా నర్సరీతో పాటు ప్రకృతి వనం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో స్థల పరిశీలనకు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మల్లెల రా జశ్రీతో పాటు కమిషనర్‌ గోపు గంగాధర్‌ , తహసీల్దార్‌ రాజేందర్‌తో పాటు డిప్యూటీ ఫారెస్టు రేంజ్‌ ఆఫీసర్‌ దేవిదాస్‌, బీట్‌ ఆఫీసర్‌ రమేష్‌రెడ్డి స్థల పరిశీలించారు. పట్టణ అభివృద్ధిలో భాగంగా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవడంతో మెగా నర్సరీ, మెగా ప్రకృతి వనం ఏర్పాటు చేసేందుకు వీలుగా ఉన్న స్థలాన్ని పరిశీలించినట్టు కమిషనర్‌ గోపు గం గాధర్‌ తెలిపారు.

Updated Date - 2021-06-23T04:41:58+05:30 IST