దైవచింతన కలిగి ఉండాలి

ABN , First Publish Date - 2021-12-09T05:39:34+05:30 IST

ప్రతి ఒక్కరూ దైవచింతన కలిగి ఉండాలని, సత్‌ప్రవర్తనతోపాటు దేవుడిని పూజించడం వల్ల సత్‌పౌరులుగా తయారవుతారని హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామి అన్నారు.

దైవచింతన కలిగి ఉండాలి

నిజామాబాద్‌ రూరల్‌, డిసెంబరు 8: ప్రతి ఒక్కరూ దైవచింతన కలిగి ఉండాలని, సత్‌ప్రవర్తనతోపాటు దేవుడిని పూజించడం వల్ల సత్‌పౌరులుగా తయారవుతారని హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామి అన్నారు. రూరల్‌ మండలం గాంధీనగర్‌లోని లింగేశ్వరగ్టు ఆశ్రమ వార్షికోత్సవంలో భాగంగా బుధవారం చివరిరోజు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆశ్రమ పీఠాధిపతి పిట్లకృష్ణ మహరాజ్‌ విద్యారణ్య భారతికి పాదపూజ నిర్వహించారు. భక్తులనుద్దేశించి మాట్లాడుతూ.. సత్‌పురుషులు, యోగులు, పీఠాధిపతులు చేసే యజ్ఞ యాగాదులు లోక కల్యాణం కోసమేనన్నారు. దైవభక్తి ఒక్కటే భక్తులను సన్మార్గంలో నడుపుతుందన్నారు. ప్రతీ హిందువు ప్రతీరోజు దేవాలయానికి వెళ్లడం తమదినచర్యగా పెట్టుకోవాలన్నారు. తమ సంతానాన్ని చిన్న తనం నుంచే వారికి దేవాలయాలకు వెళ్లేలా ప్రోత్సహించాలని, తద్వారా వారు పక్కదారి పట్టే అవకాశం ఉండదన్నారు. ఆశ్రమానికి వందల సంఖ్యలో భక్తలు తరలివచ్చారు. 

Updated Date - 2021-12-09T05:39:34+05:30 IST