తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి

ABN , First Publish Date - 2021-11-23T05:46:51+05:30 IST

అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని కొను గోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ అన్నదాతలు రోడ్డెక్కారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం మంతన్‌దేవునిపల్లి-పల్వంచ బ్రిడ్జి వాగువద్ద సోమవారం కాంగ్రెస్‌ నాయకులు, రైతులు ధర్నా నిర్వహించారు.

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి


మాచారెడ్డి, నవంబరు 22: అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని కొను గోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ అన్నదాతలు రోడ్డెక్కారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం మంతన్‌దేవునిపల్లి-పల్వంచ బ్రిడ్జి వాగువద్ద సోమవారం కాంగ్రెస్‌ నాయకులు, రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నాయకుడు మంథ రాజు మాట్లాడుతూ తడిసిన వడ్లను కొనుగోలు చేయాలని, ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకుపోయినా పట్టించుకోవడం లేదని, అందుకే రైతులతో కలిసి ధర్నా నిర్వహించినట్లు తెలిపారు. ఽవిషయాన్ని తెలుసుకున్న ఎస్సై శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్‌ అక్కడికి చేరుకుని వారిని సముదాయించి లారీలు సకాలంలో వచ్చే విధంగా చూస్తామని తెలపడంతో ధర్నా విరమించారు.

Updated Date - 2021-11-23T05:46:51+05:30 IST