సైబర్‌ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి

ABN , First Publish Date - 2021-11-24T05:01:27+05:30 IST

విద్యార్థులు సైబర్‌ నేరాల పై అవగాహన కలిగి ఉండాలని డీఈవో రాజు అన్నారు. మంగళవారం టెక్రియాల్‌లోని ప్రభుత్వ పాఠశాలలో సైబర్‌ అంబా సిడర్‌లతో మొదటి సమావేశం నిర్వహించారు.

సైబర్‌ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి
సమావేశంలో మాట్లాడుతున్న డీఈవో రాజు

కామారెడ్డి టౌన్‌, నవంబరు 23: విద్యార్థులు సైబర్‌ నేరాల పై అవగాహన కలిగి ఉండాలని డీఈవో రాజు అన్నారు. మంగళవారం టెక్రియాల్‌లోని  ప్రభుత్వ పాఠశాలలో సైబర్‌ అంబా సిడర్‌లతో మొదటి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్‌ నేరాలపై విద్యార్థులకు అవగాహ న కలిగించడానికి సమగ్ర శిక్ష విద్యాశాఖ, షీ టీం, యంగిస్థాన్‌, ఎన్‌జీవో సంస్థల ఆధ్వర్యంలో సైబర్‌ కాంగ్రెస్‌ను ఏర్పాటు చేశామన్నారు. ప్రతీ జిల్లాలో 50 పాఠశాలలను గుర్తించి అందులో పాఠశాల నుంచి ఇద్దరు విద్యార్థులను సైబర్‌ అంబాసిడర్‌లుగా ఎంపిక చేశామన్నారు. ఎంపికైన విద్యార్థులకు ఒక టీచర్‌ పర్యవేక్షణలో శిక్షణ ఇచ్చామన్నారు. విద్యార్థులు సైబర్‌ నేరాలపై పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకుని వారి తల్లిదండ్రులకు కూడా వివరించాలని తెలిపారు. కొత్త వ్యక్తులు ఎవరికి కూడా ఫోన్‌ ద్వారా బ్యాంక్‌ వివరాలు, ఓటీపీ లాంటి వాటిని ఇవ్వకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ సమన్వయ కర్త గంగాకిషన్‌, పాఠశాల హెచ్‌ఎం సంతోష్‌కుమార్‌, సైబర్‌ మెంటర్‌ టీచర్‌ విష్ణువర్ధన్‌, దేవునిపల్లి ఎస్‌ఐ జ్యోతి, కౌన్సిలర్‌ శంకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
దేవునిపల్లి పాఠశాలలో..
కామారెడ్డి పట్టణంలోని దేవునిపల్లి పాఠశాలలో సైబర్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సైబర్‌బ్రాండ్‌ అంబాసిడర్‌లుగా నియమించబడిన విద్యార్థులు సాయి అర్షిత్‌, ఐశ్వర్యలకు ప్రజెంటేషన్‌ చేయడంతో పాటు ప్రమాణ స్వీకారం చేయించారు.

Updated Date - 2021-11-24T05:01:27+05:30 IST