సీసీటీవీ శిక్షణకు ఎంతో ప్రాధాన్యం

ABN , First Publish Date - 2021-01-21T05:06:21+05:30 IST

సీసీటీవీ శిక్షణ ద్వారా జీవితంలో శిక్షణ పొందిన వారందరికి ఎంతో ఉపయోగపడుతుందని కెనరా బ్యాంక్‌ ఏజీఎం శ్రీనివాస్‌ అన్నారు.

సీసీటీవీ శిక్షణకు ఎంతో ప్రాధాన్యం

డిచ్‌పల్లి, జనవరి 20: సీసీటీవీ శిక్షణ ద్వారా జీవితంలో శిక్షణ పొందిన వారందరికి ఎంతో ఉపయోగపడుతుందని కెనరా బ్యాంక్‌ ఏజీఎం శ్రీనివాస్‌ అన్నారు. బుధవారం ఎస్‌బీఐ శిక్షణ కేంద్రంలో సీసీటీవీల శిక్షణ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం బ్యాంకు ద్వారా అందిస్తున్న రుణాల వివరాలను తెలియజేశారు. కార్యక్రమంలో శిక్షణ కేంద్రం డైరెక్టర్‌ సుదీంద్రబాబు, సిబ్బంది రామకృష్ణ, భాగ్యలక్ష్మి, రంజిత్‌, నవీన్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-21T05:06:21+05:30 IST