ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీస్‌ను ప్రారంభించిన ఎమ్మెల్సీ

ABN , First Publish Date - 2021-08-10T06:35:38+05:30 IST

నగరంలోని 5వ డివిజన్‌ పరిధిలో గల హౌజింగ్‌బోర్డు సమీపంలో సోమవారం నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ క్యాంప్‌ కార్యాలయాన్ని ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు.

ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీస్‌ను ప్రారంభించిన ఎమ్మెల్సీ
క్యాంప్‌ ఆఫీసును ప్రారంభించి ఎమ్మెల్యే బాజిరెడ్డికి అభినందనలు తెలుపుతున్న కవిత

మోపాల్‌, ఆగస్టు 9: నగరంలోని 5వ డివిజన్‌ పరిధిలో గల హౌజింగ్‌బోర్డు సమీపంలో సోమవారం నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ క్యాంప్‌ కార్యాలయాన్ని ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండేందుకే సీఎం కేసీఆర్‌కు క్యాంప్‌ ఆఫీసుల నిర్మాణానికి రూపకల్పన చేశారన్నారు. నిన్నామొన్నటి వరకు నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే ఇంటికి వచ్చేవారని, కార్యాలయం ఏర్పాటు కావడంతో అందరూ ఇక్కడికే వచ్చి తమ సమస్యలు పరిష్కరించుకునే అవకాశం ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వీజీగౌడ్‌, నగర మేయర్‌ నీతూకిరణ్‌, నుడా చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డితో పాటు రూరల్‌ నియోజకవర్గంలోని ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, నగర కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.

పలు అభివృద్ధి పనులకు భూమిపూజ

నిజామాబాద్‌ రూరల్‌: నగరంలోని 1, 3వ డివిజన్‌లలో సోమవారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌తో కలిసి పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. సోమవారం ఉదయం కాలూరులో రూ.75లక్షల వ్యయంతో చేపట్టిన ఊరచెరువు పునరుద్ధరణ (మినీ ట్యాంక్‌ బండ్‌) పనులకు భూమిపూజ చేశారు. అనంతరం 3వ డివిజన్‌లోని గంగాస్థాన్‌ ఫేజ్‌-2లో రూ.45లక్షలతో అర్బన్‌ పార్కు పనులకు భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో నుడా డైరెక్టర్‌ ముష్క సంతోష్‌, కార్పొరేటర్లు కొర్వ లలిత, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-10T06:35:38+05:30 IST