కేంద్ర బడ్జెట్‌పై మిశ్రమ స్పందన

ABN , First Publish Date - 2021-02-02T05:11:38+05:30 IST

కేంద్ర బడ్జెట్‌పై ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా నేతలు మిశ్రమ స్పందన వ్యక్తపరిచారు. సోమవారం పార్లమెం ట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రవే శపెట్టిన 2021-22 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ కంటి తుడుపు చర్యగానే ఉందని ప్రతిపక్ష నేతలు ఆ రోపించారు.

కేంద్ర బడ్జెట్‌పై మిశ్రమ స్పందన

సామాన్యుడికి ఆశించిన వరాలు లేవన్న ప్రతిపక్షాలు

ప్రజలకు మేలుజరుగుతుందన్న బీజేపీ నేతలు

నిజామాబాద్‌, (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) / కామారెడ్డి : కేంద్ర బడ్జెట్‌పై ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా నేతలు మిశ్రమ స్పందన వ్యక్తపరిచారు. సోమవారం పార్లమెం ట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రవే శపెట్టిన 2021-22 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ కంటి తుడుపు చర్యగానే ఉందని ప్రతిపక్ష నేతలు ఆ రోపించారు. సా మాన్యులకు ఉపయోగపడే విధంగా ఎలాంటి కేటాయిం పులు లేవని అన్నారు. వ్యవసాయంలో రైతుల కు, ఉమ్మ డి జిల్లాలో రైల్వేకు ఎలాంటి ప్రయోజనం లేదని అన్నా రు. బీజేపీ  నేతలు మాత్రం ప్రజలకు ఉపయోగపడే వి ధంగా ఉందని తెలిపారు. ప్రజల నుంచి సైతం ఆశించిన స్థాయిలో బడ్జెట్‌పై స్పందన రాలేదు. ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా వడ్డింపులే పెరిగాయని పలువురు త మ అభిప్రాయం వ్యక్తం చేశారు. వైద్యానికి పెద్దపీట వే యడం మాత్రం శుభపరిణామంగా పేర్కొన్నారు. ఉద్యో గులపై ఇన్‌ కంటాక్స్‌ భారాన్ని వేయకపోవడాన్ని స్వాగ తించారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుపై సర్వత్రా విమ ర్శలు వ్యక్తమవుతున్నాయి. భవన నిర్మాణ రంగానికి రా యితీలను ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నారు. 

 కేంద్ర బడ్జెట్‌ ఊహించినంత రాలేదు

బీబీపాటిల్‌, ఎంపీ, జహీరాబాద్‌ నియోజకవర్గం

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ జహీరాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో ఊ హించినంత రాలేదు. కొత్త ప్రాజెక్టులు రా లేదు. ప్రజలు ఊహించన విధంగా ప్ర భుత్వం కేటాయింపులు చేయలేదు. ఊరి ంచి ఉసూరుమనిపించేలా బడ్జెట్‌ ఉంది.  

అన్ని వర్గాలకు లబ్ధిచేకూరేలా లేదు

గంప గోవర్ధన్‌, ప్రభుత్వ విప్‌, కామారెడ్డి

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అన్ని వర్గాల ప్రజలకు లబ్ధిచేకుర్చేలా లే దు. ఊహించిన దానికంటే తక్కువ కేటా యింపలు చేశారు. బడుగు, బలహీన వ ర్గాలకు ఈ బడ్జెట్‌ అనుకులంగా లేదు. చి న్న వస్తువుల ధరలు తగ్గించి ఎక్కువగా ఉపయోగించే వస్తువులపై ధరలను పెంచే ప్రయత్నం చేసింది. 

సామాన్యుడిపై భారం మోపుతున్న బడ్జెట్‌

దేగాం యాదాగౌడ్‌, టీడీపీ జిల్లా అధ్యక్షుడు

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ సామాన్యు డిపై భారం మోపింది. సుంకాలు పెంచడ ంతో ప్రజలపై తీవ్రమైన భారం పడనుంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరింత పెరగ నున్నాయి. ఈ బడ్జెట్‌లో రైతులకు ఒరిగిం దేమి లేదు. రైతులు, కార్మికులు, మధ్యతర గతి వారి ఆశలు అడియాశలయ్యాయి. 

రాష్ట్రానికి మొండి చేయి

ఈగ గంగారెడ్డి, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు

బడ్జెట్‌లో రాష్ట్రానికి మొండి చేయి చూపారు. కీలక ప్రాజెక్టు లకు కేటాయింపులు చేయలేదు.   సుంకాలు పెంచడం వల్ల పేద లపైన భారం పడుతుంది. కీలక రైల్వే ప్రాజెక్టుల్లో అంత మాత్రం గానే కేటాయింపులు చేశారు. వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేలా నిధుల కేటాయింపు చేయలేదు.

నిరాశ పరిచిన కేంద్ర బడ్జెట్‌

మోహన్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు, నిజామాబాద్‌

కేంద్ర బడ్జెట్‌ ప్రజలను నిరాశపరి చే విధంగా ఉంది. వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నామని చెప్పి పెట్రో ల్‌, డీజిల్‌ ధరలను పెంచారు. దీనివ ల్ల సామాన్యులు, రైతులపైన భారం పడుతుంది. బీజేపీ ఎంపీ ఉన్నా రై ల్వేకు కేటాయింపులు లేవు. యువతకు ఆశించిన స్థాయి లో వరాలు ఈ బడ్జెట్‌లో ప్రకటించలేదు.

ప్రజల ఆశలపై నీళ్లు చల్లిన బడ్జెట్‌

రమేష్‌బాబు, సీపీఎం జిల్లా కార్యదర్శి

పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై సుంకం పెంచడంతో నిత్యావసర సరుకుల ధ రలు పెరుగుతాయి. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ నిఽధి ఏర్పాటు చేసినా  రై తులకు ఒరిగేదేమి లేదు. ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్‌ఐసీలో 74 శాతం ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించి ప్రైవేటుపరం చేయా లనిచూస్తున్నారు. బడ్జెట్‌లో ప్రజల ఆశలపై నీళ్లు చల్లారు.

దేశ ప్రజలకు ఉపయోగపడే బడ్జెట్‌

బస్వా లక్ష్మీనర్సయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షుడు 

కరోనా సమయంలో ప్రజల ందరికీ ఉపయోగపడే విధంగా కేంద్రం బడ్జెట్‌ను ప్రవేశపెట్టిం ది. వైద్యరంగానికి కేటాయింపు లు చేయడం వల్ల సామాన్యుడి కి ఖరీదైన వైద్యం అందుతుం ది. మౌలికరంగాలకు ఈ బడ్జెట్‌లో పెద్దపీఠ వేశారు. పెన్షనర్‌లకు ఉపయోగపడే నిర్ణయం తీసుకున్నారు. 

Updated Date - 2021-02-02T05:11:38+05:30 IST