వేల్పూర్‌లో మంత్రులు ఎర్రబెల్లి, వేముల పర్యటన

ABN , First Publish Date - 2021-07-09T04:58:34+05:30 IST

వేల్పూర్‌ మండలంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను గురువారం రాష్ట్ర పంచాయ తీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రోడ్లు భవనాలు, గృహనిర్మాణం, శాసనసభ వ్యవహారాల శా ఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

వేల్పూర్‌లో మంత్రులు ఎర్రబెల్లి, వేముల పర్యటన
రైతు వేదిక ఆవరణలో మొక్క నాటుతున్న మంత్రి ఎర్రబెల్లి

పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, రైతు వేదిక పరిశీలన
రైతు వేదికలో మొక్కనాటిన మంత్రి ఎర్రబెల్లి
మండల కేంద్రంలో తడిపొడి చెత్తపై మహిళలకు అవగాహన

వేల్పూర్‌, జూలై 8: వేల్పూర్‌ మండలంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను గురువారం రాష్ట్ర పంచాయ తీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రోడ్లు భవనాలు, గృహనిర్మాణం, శాసనసభ వ్యవహారాల శా ఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా పల్లెప్రకృతి వనం, వైకుంఠధామం, రైతు వేదికలను వారు సందర్శించారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొనడానికి బుధవారం రాత్రి వేల్పూర్‌కు వచ్చిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిలో బస చేశారు. గురువారం ఉదయం స్వయంగా వాహనం నడుపు తూ గ్రామంలో ఇద్దరు మంత్రులు కలియ తిరిగి పరి సరాలను పరిశీలించారు. తడిపొడి చెత్త పట్ల మహిళ లకు అవగాహన కల్పించారు. చెత్తను తరలించే ట్రాలీ లు ఏ సమయానికి వస్తున్నాయని మహిళలను అడిగి తెలుసుకున్నారు. తడిపొడి చెత్త వేర్వేరుగా సేకరించా లని మంత్రి దయాకర్‌రావు పంచాయతీ సిబ్బందిని ఆ దేశించారు. గ్రామంలో పర్యటిస్తుండగా కిరాణ షాప్‌ ముందు ప్లాస్టిక్‌ కవర్లు, చెత్త పేరుకుపోయి ఉండడా న్ని గమనించిన మంత్రి దయాకర్‌రావు షాప్‌ యజ మానికి రూ.100 జరిమానా విధించాలని అధికారుల ను ఆదేశించి షాప్‌ యజమానిని హెచ్చరించారు. మ న పరిసరాలను శుభ్రం ఉంచుకోవాల్సిన బాధ్యత మన దే అని అన్నారు. అంతకు ముందు పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామంలో మంత్రి దయాకర్‌రావు పర్యటించి ప్రకృతి వనంలో చెట్ల మధ్యలోని ఖాళీ స్థలంలో ఆహ్లా దకరంగా ఉండేలా గ్రీన్‌ గ్రాస్‌ పెంచాలని మంత్రి సూ చించారు. వైకుంఠధామంలో వెయిటింగ్‌హాల్‌ మొత్తం కాంక్రిట్‌ స్లాబ్‌ వేయాలని అధికారులను ఆదేశించారు. పల్లె ప్రకృతి వనం, వైకుంఠదామం పనులు గ్రామాల్లో సదుపాయాలు, నిర్వహణ పట్ల మంత్రి ఎర్రబెల్లి సం తృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మంత్రి వేముల ప్ర శాంత్‌రెడ్డి తండ్రి, రైతు నాయకుడు దివంగత వేముల సురేందర్‌రెడ్డి జ్ఞాపకార్థం నిర్మించిన రైతు వేదికను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సందర్శించారు. రైతు వేదిక ఆవరణలో హరితహరం మొక్కలు నాటారు.
అనంతరం వేల్పూర్‌ క్రాస్‌రోడ్డు వద్ద స్వర్గీయ వే ముల సురేందర్‌రెడ్డి విగ్రహానికి మంత్రి ఎర్రబెల్లి ద యాకర్‌రావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అలాగే, వేముల సురేందర్‌రెడ్డి స్మృతివ నం ఘాట్‌ వదదకు వెళ్లి నివాళులు అర్పిస్తూ మాట్లా డారు. స్వర్గీయ వేముల సురేందర్‌రెడ్డితో తనకున్న అ నుబంధాన్ని, కలిసి పనిచేసిన అనుభావాలను ఈ సం దర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు గుర్తుచేశా రు. ఈ కార్యక్రమంలో జడ్పీచైర్మన్‌ దాదన్నగారి విఠల్‌ రావు, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌, మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ మార గంగారెడ్డి, డీసీసీబీ వైస్‌చైర్మన్‌ రమేష్‌రెడ్డి, ఎంపీపీ బీ మ జమున రాజేందర్‌, జడ్పీటీసీ భారతి రాకేష్‌చంద్ర, ఏఎంసీ చైర్మన్‌ చిన్నారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షు డు జైడి నాగాధర్‌రెడ్డి, జిల్లా ఆర్‌టీఏ కమిటీ సభ్యుడు రేగుల్ల రాములు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, సొసైటీ చై ర్మన్‌లు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-09T04:58:34+05:30 IST